Weight loss Tips: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు..
Weight loss Tips: ఎండకాలం వేడిమికి చెక్ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్నానం ఎక్కవగా చేయడం, నీరు ఇతర పానియాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటాం. అయితే, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను ఈ ఎండలకు మన డైట్లో చేర్చుకుంటే బరువు త్వరగా కూడా తగ్గుతారు.
Weight loss Tips: ఎండకాలం వేడిమికి చెక్ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్నానం ఎక్కవగా చేయడం, నీరు ఇతర పానియాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటాం. అయితే, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను ఈ ఎండలకు మన డైట్లో చేర్చుకుంటే బరువు త్వరగా కూడా తగ్గుతారు. రోజంతటికీ సరిపడా నీరు మన శరీరానికి అందుతుంది. హైడ్రేటేడ్ గా ఉంటారు.
టమాటాలు..
టమాటాల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు టమాటాల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. టమాటాను అన్ని కూరల్లో వేసుకుని తింటారు. ఇది ఎండకాలం తీసుకోవాల్సిన సమ్మర్ మీల్.
రాడిష్..
రాడిష్ లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో నుంచి కాస్తు ఘాటైన వాసన వస్తుంది. అయితే, రాడిష్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
సెలరీ..
సెలరీలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ, నీరు అధికంగా ఉంటుంది. సెలరీని సాధారణంగా సూప్స్, సలాడ్స్ లో వేసుకుని తీసుకుంటారు. ఇందులో ఉండే పోషకాలు ఎంతో ఆరోగ్యకరం
బ్రస్సెల్స్..
బ్రస్సెల్స్ లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కావాల్సినంత విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది బాడీ మెటబాలిజం రేటును పెంచడంలో సహాయపడి, అధిక బరువుకు చెక్ పెడతాయి.
ఇదీ చదవండి: చందనంతో ఇలా ఉబ్తాన్ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..
క్యారట్లు..
క్యారట్లలో కూడా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారట్లో యాంటీ ఆక్సిడెంట్లో బరువు పెరగకుండా సహాయపడుతంది
ఇదీ చదవండి: కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఇడ్లి, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది..
బెల్ పెప్పర్స్..
బెల్ పెప్సర్స్ గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ కూరగాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బెల్ పెప్పర్ లో విటమిన్ సీ, ఇ నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది,(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook