Coconut flower: వావ్.. కొబ్బరి పువ్వుతో కోటి ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Benefits of coconut flower: చాలా మంది కొబ్బరి కాయలో పువ్వు వస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కొందరు కొబ్బరిపువ్వును చక్కెర వేసుకుని తింటారు. కానీ మరికొందరు కొబ్బరి పువ్వు తినడానికి ఆసక్తి చూపించరు. కానీ దీని వల్ల కలిగే ఈ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతెస్తారు.
Amazing health benefits with eating coconut flower: కొబ్బరిలో కొబ్బరి పువ్వులు చాలా అరుదుగా బైటపడుతుంటాయి. దీన్ని చాలా మంది శుభప్రదంగా భావిస్తారు. కానీ కొందరు మాత్రం.. కొబ్బరి పువ్వు అంతగా ఇష్టపడరు. కానీ కొబ్బరి పువ్వులో విటమిన్లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా.. పల్లెటూర్లలోని కొన్ని ప్రదేశాలో ఎక్కడ చూసిన కూడా కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. చాలా మంది కొబ్బరి చెట్లను ఇళ్లలో పెంచుకుంటారు. కొబ్బరి చెట్టులోని ప్రతిఒక్కటి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి కొమ్మలు, కాయలు, పండ్లు , కొబ్బరి నీళ్లు కూడా ఉపయోగపడుతుంటాయి.
Read more: Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?
నిజానికీ కొబ్బరి కాయలో నీళ్లు ఎండిపోయిన తర్వాత కొబ్బరి పువ్వు ఏర్పడుతుంది. అది తెల్లగా ఉంటుంది. దీనిలో కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్తుంటారు. అదే విధంగా ఇది ఎంతో టెస్టీగా కూడా ఉంటుంది. కొబ్బరి పువ్వులో జీర్ణవ్యవస్థను వేగవంతం చేసే గుణాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని వేగవంతం చేస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ పెషెంట్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. రక్తం సరఫరాలో కూడా ఆటంకాలు లేకుండా కాపాడుతుంది.
కాబట్టి, మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని మిస్ చేసుకోకుండా హ్యాపీగా తినొచ్చు. అంతేకాదు కొబ్బరి పువ్వును ప్రతిరోజు తినడం వల్ల.. బెల్లీ ఫ్యాట్ కూడా ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా.. బరువు తగ్గొచ్చు.
Read more: Red lady finger: ఎర్రబెండకాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా... ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..
కొబ్బరి పువ్వు తినడం వల్ల.. అలసట, నీరసం, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ కు చెందిన ఎలాంటి సమస్యలైన దూరమౌతాయి. తెల్లని వెంట్రుకలు, ముఖంమీద ముడతలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను ఇది దూరం చేస్తుంది. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధిని దరి చేరకుండా చేయడంలోను ఉపయోగపడుతుంది. కాబట్టి, కొబ్బరి పువ్వు దొరికినప్పుడు..మిస్ చేసుకోకుండా తినాలని నిపుణులు చెప్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter