Red lady finger: ఎర్రబెండకాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా... ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..

Red lady finger: ఆకుపచ్చని బెండకాయలకన్నా.. ఎరుపు రంగు బెండకాయల్లో ఆరోగ్యానికి మంచి చేసే అనేక కారకాలు ఉంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు తింటే శరీరంలోని అనేక రుగ్మతలు దూరమౌతాయని తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 28, 2024, 09:43 PM IST
  • ఎర్రని బెండకాయలతో ప్రయోజనాలు..
  • నిపుణులు చెబుతున్న సూచనలివే..
Red lady finger: ఎర్రబెండకాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా... ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..

Amazing health benefis of eating red colour lady finger:  ఆకుపచ్చని బెండకాయల కన్నా.. కూడా ఎర్రటి బెండకాయల వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిక్, అధిక కొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ప్రతిరోజు ఎర్రటి బెండకాయలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎర్రటి బెండకాయల వల్ల  ఒత్తిడి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు దూరమౌపోతాయి. ప్రతిరోజు ఎర్రటి బెండకాయల్ని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం పూట ఆ నీళ్లను తాగాలి. ఇలా తాగుతుంటే.. ముఖంపైన ఉన్న మచ్చలు తగ్గిపోతాయి. మొటిమలు దూరమౌతాయి.

Read more: Paris Olympics 2024: 16 ఏళ్లకే స్వర్ణం.. ఒలింపిక్స్ లో బోణి కొట్టిన మనూబాకర్ గురించి ఈ విషయాలు తెలుసా..?  

తెల్లని వెంట్రుకలు క్రమంగా నల్లగా మారిపోతాయి. కొందరు చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలాగా ముఖం ముడతలు పడిపోతుంది. ఇలాంటి వారు ప్రతిరోజు ఎర్రటి బెండకాయల్ని ఎక్కువగా తినాలి. దీని వల్ల మెమోరీ కూడా పెరుగుతుందని చెబుతుంటారు. మహిళలు ముఖ్యంగా చాలా మంది పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజు బెండకాయల్ని తింటు ఉండాలి.

ఇది గుండె సంబంధిత రోగాల్ని కూడా నయంచేస్తుదంటారు. అంతేకాకుండా.. పీరియడ్స్ సమయంలో మహిళల్లో రక్తం పోవడాన్ని పూర్తిగా నిరోధిస్తుంది. తెల్లని డిశ్చార్జు ను కూడా అరికడుతుంది. అందుకు చాలా మంది పచ్చని బెండకాయల కన్నా..ఎర్రటి బెండకాయల్ని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీనిలోపోషకాలు పుష్కలంగాఉంటాయి. కానీ ఇవి అత్యంత అరుదుగా మాత్రమే మార్కెట్ లో దొరుకుంటాయి.

Read more: Delhi IAS Coaching Centre: ఢిల్లీ కోచింగ్ సెంటర్ లో వరద నీళ్లు.. ముగ్గురు సివిల్స్  విద్యార్థుల మృతి..  

కానీ వీటి వల్ల మాత్రం అనేక ప్రయోజనాలు ఉన్నాయనిచెబుతుంటారు.ఉదయం పూట పరగడుపున ఎర్రటి బెండకాయల్ని ప్రతిరోజు తినాలని సూచిస్తుంటారు. వెంట్రుకలు రాలడం, తెల్లని జుట్టు వంటి సమస్యలు కూడా దూరమౌతాయి. అందుకే ఎర్రటి బెండకాయల్ని తినాలని చెప్తుంటారు. జీర్ణవ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. ముఖంపై నల్లని మచ్చలు,కళ్లకింద వలయాల్నికూడా ఎర్రటి బెండ దూరం చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News