Asafoetida For Piles Problems: ఇంగువ ఆహారాల రుచిని రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే భారతీయులు ఇంగువను ఆహారాలలో ఎక్కువగా వాడుతుంటారు. దీనిలో శరీరాన్ని కావలసిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా పాలలో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న చాలామందికి ఇంగువను ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు. అయితే దీనిని పాలలో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణ క్రియ సమస్యల నుంచి ఉపశమనం:
ఇక జీవన శైలి కారణంగా చాలామంది మలబద్ధకం, ఆసిడిటీ, గ్యాస్ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పాలలో ఇంగువను కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


చాలామంది ఎక్కిళ్ల సమస్యలతో బాధపడతారు. కొందరైతే తరచుగా ఎక్కిళ్ల బారిన పడతారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు పాలలు ఇంగువను వేసుకుని తాగితే చిటికెలోనే ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పైల్స్ నుంచి ఉపశమనం:
ఇంగువ పాలను పైల్స్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే పైల్స్ నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పాలలో ఇంగువ కలుపుకొని తాగాల్సి ఉంటుంది.


చెవి నొప్పి:
చలికాలంలో చెవి నొప్పిలు, శరీర నొప్పులు రావడం చాలా సర్వసాధారణం. అయితే ఈ నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంగువ కలిపిన పాలను నొప్పి ఉన్న చెవులు చుక్కల మందుల వేయాల్సి ఉంటుంది. ఇలా వేస్తే చెవి నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.


Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!  


Also Read: Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి