Avoid Consuming These Food Items With Alcohol: కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో మద్యం సేవిస్తుంటారు. కొన్ని చోట్ల అలవాటు చేసుకున్న కారణంగా ఆల్కహాల్ తీసుకుంటారు. కొందరు బాధలో ఉన్నప్పుడు మద్యం సేవిస్తే, మరికొందరు తమ పుట్టినరోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే కొందరు మద్యం సేవించే సమయంలో ఎక్కువగా తిను పదార్థాలు తీసుకుంటారు. మరికొందరు మందుబాబులు ఎలాంటి స్టఫ్ లేకుండా బీరు సీసాలకు సీసాలు, లేక గ్లాసులకు గ్లాసులు లాగించేవాళ్లు లేకపోలేదు. చివరగా ఇంకొక్క క్వార్టర్ ఉంటే బాగుండేదంటూ మందుబాబులు ముచ్చట్లు చెబుతుంటారు. కానీ మద్యం(Alcohol Latest Update) సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు తినకూడదో మీకు తెలుసా. మద్యం సేవించే సమయంలో ఈ పదార్ధాలు స్టఫ్‌గా తీసుకోకూడదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు



జీడిపప్పు లేదా వేరుశెనగ తినకూడదు
మద్యం సేవిస్తూ వేరుశెనగ మరియు పొడి జీడిపప్పు తినడం చాలా మందికి ఇష్టం. కానీ ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ మద్యం సేవిస్తూ తినకూడదు. వేరుశెనగ మరియు జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ తాగుతూ వీటిని తినడం ద్వారా వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉందట.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త



సోడా లేదా కూల్ డ్రింక్స్‌తో మద్యం సేవించవద్దు
కొంతమందికి సోడా లేదా కోల్డ్ డ్రింక్‌తో పాటు మద్యం సేవించే అలవాటు ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్‌లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. అందుకే వీలైతే నీళ్లు కలుపుకుని ఆల్కహాల్ సేవించాలి.


Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి



మద్యంతో జిడ్డు పదార్థాలు తినవద్దు
మద్యం సేవించేటప్పుడు లేదా మద్యం సేవించిన తర్వాత ఎప్పుడూ జిడ్డు ఉండే పదర్ధాలను తినకూడదు. తద్వారా కడుపులో గ్యాస్ మరియు కడుపులో మంట లాంటి సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్‌ను కూడా స్టఫ్‌గా తినకూడదు. చిప్స్ తినడం వల్ల మీకు చాలా దాహం వస్తుంది. దీనివల్ల కాస్త నియంత్రణ కోల్పోయి మందుబాబులు మరింత ఎక్కువ మద్యం తాగుతారు.



పాల ఉత్పత్తులను తినవద్దు
కొంతమంది మద్యంతో జున్ను లాంటివి తింటారు. పొరపాటున కూడా అలా తినకూడదు. పాల ఉత్పత్తుల(Milk Products)తో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినకూడదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.


Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం



మద్యంతో తీపి పదార్థాలు తినవద్దు
మద్యం సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook