Benefits Of Bitter Gourd Seeds: కాకరకాయ వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు దోహదపడతాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకరకాయతోనే కాకుండా వీటి గింజలు ద్వారా కూడా డయాబెటిక్ పేషెంట్లకు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయ కూర వండేటప్పుడు వాటి గింజలను తొలగించి వండుతున్నారు. ఇలా చేయడం వల్ల కాకరకాయ లో ఉండే విటమిన్స్ శరీరానికి తగిన మోతాదులో అందలేకపోతున్నాయి. డయాబెటిక్ పేషెంట్ల కోసం కాకరకాయ వండే క్రమంలో తప్పకుండా వీటి గింజలతో వందలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలను ఆహారంలో తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని వారు తెలుపుతున్నారు. అయితే ఈ గింజల ద్వారా లభించే ఇతర ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..


కాకరకాయ గింజల వల్ల వచ్చే ప్రయోజనాలు:


మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది:


డయాబెటిక్ పేషెంట్స్ కోసం కాకరకాయను వండే క్రమంలో తప్పకుండా వాటి గింజలతో వండలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వండుకొని తినడం ద్వారా శరీరంలో జీవక్రియ మెరుగుపడి మలబద్దకం సమస్యలు తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. 


 కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:


డయాబెటిక్ పేషెంట్‌లో అధికశాతం కొలెస్ట్రాల్ ఉంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితిలో కాకరకాయ గింజలతో ఈ తీవ్రతను నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:



కాకరకాయ గింజలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి ఇవి శరీరంలో  రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా  జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి, దృఢంగా చేస్తాయి.



కాకరకాయ గింజలను ఈ విధంగా ఉపయోగించండి:


 కాకర గింజలను ఎండబెట్టి పొడిగా చేసి వేడినీళ్లలో వేసుకుని తాగితే.. పొట్ట శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా గింజలను, వెల్లుల్లి తో కలిపి గ్రైండ్ చేసి  పూరీలు చేసుకునే క్రమంలో కూడ వాడుకోవచ్చు.


 (NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Tulsi Uses And Benefits: తులసి మొక్క తరుచుగా ఎండిపోతుందా.. అయితే ఇలా చేయండి..!


Also Read: Secunderabad Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. అంతా ప్రీ-ప్లాన్డ్‌ గానే జరిగిందా..?


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook