Carrot Juice: క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారా..?
Weight Loss With Carrot Juice: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడకుండా మంచి మంచి ఆహారాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది రోజూ తీసుకునే ఆహారంలో క్యారెట్ వంటి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకుంటున్నారు.
Weight Loss With Carrot Juice: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడకుండా మంచి మంచి ఆహారాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది రోజూ తీసుకునే ఆహారంలో క్యారెట్ వంటి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకుంటున్నారు. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. కావున వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషక విలువలు లభిస్తాయి. అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగు పరుచుతాయి. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని దృఢంగా చేస్తాయి. అయితే ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే.. రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యారెట్‌లో లభించే పోషకాలు ఇవే:
క్యారెట్‌లో బాడీకి అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి అనేక ఖనిజాలు ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా భారతీయులు క్యారెట్ హల్వాను ఎక్కువ తినేందుకు ఇష్టపడతారు. అయితే వీటిని జ్యూస్ చేసుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం..
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
<< క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ముఖంపై చర్మం మెరుగుపడుతుంది. క్యారెట్ వల్ల మన రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
<<మొటిమల సమస్యలతో బాధపడుతుంటే..క్యారెట్ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మొండి మొటిమలను సులభంగా నియత్రిస్తుంది.
<<పళ్ళ చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న వారు తప్పనిసరిగా క్యారెట్ జ్యూస్ తాగాలి. దంతాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది
<<దగ్గు, ఇతర సమస్యల నుంచి.. క్యారెట్ రసం ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ రసంలో నల్ల మిరియాలు కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనం కలుగుతుంది.
<<క్యారెట్‌లో ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపరిచి.. బరువును సులభంగా నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook