Gas Top Cleaning Tips: గ్యాస్ స్టవ్‌పై మురికి పేరుకుందా? ఇలా శ్రమలేకుండా నిమిషాల్లో శుభ్రం చేయండి..
Gas Top Cleaning Tips: మనం ప్రతిరోజూ వంట చేసుకుంటాం. కాబట్టి గ్యాస్ టాప్ మురికి పేరుకుంటుంది. నూనె, జిడ్డు మొండి మరకలతో పాడవుతుంది. ఒక్కోసారి గ్యాస్ బర్నర్లోకి కూడా ఆ మురికి వెళ్తుంది. దీంతో మంట కూడా చిన్నగా మండుతుంది.
Gas Top Cleaning Tips: మనం ప్రతిరోజూ వంట చేసుకుంటాం. కాబట్టి గ్యాస్ టాప్ మురికి పేరుకుంటుంది. నూనె, జిడ్డు మొండి మరకలతో పాడవుతుంది. ఒక్కోసారి గ్యాస్ బర్నర్లోకి కూడా ఆ మురికి వెళ్తుంది. దీంతో మంట కూడా చిన్నగా మండుతుంది. అయితే, ఇంట్లోనే గ్యాస్ బర్నర్ క్లీన్ చేసుకునే హ్యాక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.ఇంట్లో నిత్యం వంట చేసుకునే గది శుభ్రంగా లేకపోతే, చికాకుగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ మనం తింనే ఆహారాన్ని వండుకుంటాం. కాబట్టి కిచెన్ ను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యం. లేకపోతే బొద్దింకలు చేరిపోయి అపరిశుభ్రంగా మారుస్తాయి.ఇంట్లో సాంబార్, నాన్ వెజ్ ఇలా ఏ వంటకాలు చేసుకున్నా గ్యాస్ టాప్ పై పొరపాటున పడతాయి. దీంతో గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా.. కాస్త జిడ్డు మొండి మరకలు గ్యాస్ టాప్ పై అలాగే ఉంటాయి.దీనికి ఇంట్లోని కొన్ని వస్తువులతో చిటికెలో గ్యాస్ స్టవ్‌ను తళతళమని మెరిపించేయొచ్చు.
ఇదీ చదవండి: గోధుమ పిండితో చేసిన చపాతీలు ప్రతిరోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా మన అందరి ఇళ్లలో బేకింగ్ సోడా, డిష్ వాషర్ సోప్ ఉంటుంది. వీటి సహాయంతో గ్యాస్ స్టవ్ టాప్ ను క్లీన్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో బేకింగ్ సోడ, డిష్ వాషర్ సమపాళ్లలో వేసుకుండి. ఆ రెండిటినీ కలిపి గ్యాస్ స్టవ్ పై పోయండి. కాసేపు అలాగే నాననివ్వండి. ఓ పదినిమిషాలు తర్వాత శుభ్రంగా చేయండి. ఏదైనా స్టీల్ పీచుతో రుద్దితే సరిపోతుంది. బేకింగ్ సోడా వల్ల గ్యాస్ టాప్ కొత్తవాటిలా మెరుస్తుంది.
బేకింగ్ సోడా, నిమ్మకాయ, ఉప్పు..
ఈ మూడింటినీ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. వీటితో కూడా గ్యాస్ టాప్, బార్నర్ కూడ శుభ్రం చేసుకోవచ్చు. రాత్రి పూట గ్యాస్ బర్నర్లను వెనిగర్, బేకింగ్ సోడా కలిపిన నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఓ బ్రష్ తో వీటిని క్లీన్ చేయాలి. బర్నర్లను నిమ్మకాయతో రుద్దితే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి.
ఇదీ చదవండి: వేసవిలో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు..
కేవలం నిమ్మకాయరసం, బేకింగ్ సోడా రెండిటినీ కలిపి స్టవ్ శుభ్రం చేసుకోవచ్చు. ఈరెండిటినీ బాగా కలిపి గ్యాస్ స్టవ్ పై పోయాలి. ఆ తర్వాత స్క్రబ్ తో స్టవ్ ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కేవలం వైట్ వెనిగర్ సహాయంతో కూడా కిచెన్ స్టవ్ ను శుభ్రం చేసుకోవచ్చు. నీరు, వైట్ వెనిగర్ రెండిటినీ ద్రావణంలా తయారు చేసుకోవాలి. ఈ రెండిటి మిశ్రమాన్ని ఓ స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేస్తూ రుద్దాలి. ఎప్పుడు గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేసినా గ్యాస్ సిలిండర్ నాబ్ ను ఆఫ్ చేసి శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి