Wheat Chapati Benefits: ప్రతిరోజూ ఉదయం కొంతమందికి గోధుమపిండి చపాతీలు తినే అలవాటు ఉంటుంది. మరికొంతమంది రాత్రి కూడా తప్పనిసరిగా గోధుమపిండి చపాతీలు తింటారు. ఇది బరువు, ఒబేసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఇలా చేస్తారు. కానీ, ప్రతిరోజూ గోధుమపిండితో చేసిన చపాతీలు తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రతిరోజూ మూడుపూటల అన్నం తినడం ఆరోగ్యకరం కాదు. ఇందులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. కానీ, గోధుమపిండి చపాతీల్లో క్యాలరీలు 70-80 మధ్యలో ఉంటాయి. అదే రైస్ లో 204 క్యాలరీలు ఉంటాయి. అందుకే చపాతీలు తింటే ఆరోగ్యం.గోధుమపిండిలో విటమిన్ బీ, ఇ, కాపర్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, పిండి పదార్థాలు గోధుమల్లో పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోజంతటికీ సరిపడా శక్తినిస్తాయి.
ముఖ్యంగా గోధుమపిండితో చేసిన చపాతీలు తినండం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్‌తో బాధపడేవారికి ఎంతో మంచిది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. గోధమపిండి బరువు పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే క్యాలరీల స్థాయిలు తక్కువ కాబట్టి బరువు పెరగరు. గోధుమల్లో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల చపాతీలను డైట్లో చేర్చుకుంటే శరీరానికి అవసరమ్యే హిమోగ్లోబిన్ స్థాయిలు నిర్వహిస్తుంది. ఇది మిమ్మల్ని ఎనిమియా బారి నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది.
ఇదీ చదవండి: ఇంట్లో అమ్మ చేసే టోమాటొ కర్రీ.. బ్యాచ్‌లర్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు!
వెయిట్ లాస్ జర్నీలో అయితే గోధుమలతో చేసిన చపాతీలు మంచివి. చపాతీలు తిన్న చాలాసేపు వరకు ఆకలి వేయదు. పిల్లలకు కూడా గోధుమపిండితో తయారు చేసిన చపాతీలు ఎంతో ఆరోగ్యకరం.ముఖ్యంగా గోధుమపిండితో చేసిన చపాతీలు పాలతో కలుపుకుని తింటే ముఖంపై కూడా మెరుపు పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా గోధుమపిండి చపాతీలు సహాయపడతాయన్నమాట.. చపాతీలను అన్ని రకాల కూరగాయలు, నాన్ వెజ్ వంటకాలతో తినవచ్చు.గోధుమపిండి చపాతీల్లో మంచి కార్బొహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రోటీన్ కంటెంట్ కూడా రైస్ కంటే గోధుమపిండి చపాతీల్లోనే అధికంగా ఉంటుంది. చపాతీలు డయాబెటిస్ లెవల్స్ నియంత్రిస్తాయి.
ఇదీ చదవండి: వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే ఐదు అద్బుత పానీయాలు
ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లో ఉండటం వల్ల గోధుమపిండితో చేసిన చపాతీలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించి కార్డియోవాస్క్యూలర్ గుండె సమస్యలు రాకుండా కాపాడతాయి.శనగపిండి చపాతీలు తినడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి