COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Carrot Rice Recipe In Telugu: ఆధునిక జీవన శైలి కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే మనది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ సమయంలో తప్పకుండా కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లల్లో పోషకాహార లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది పిల్లల్లో చర్మ సమస్యలు కంటిచూపు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పిల్లలకు ప్రతిరోజు విటమిన్స్ కలిగిన ఆహారాలను అందించడం ఎంతో మంచిది. 


ముఖ్యంగా పిల్లలకు క్రమం తప్పకుండా క్యారెట్‌తో తయారు చేసిన ఆహారాలను ఇవ్వడం వల్ల పోషకాహార లోపం నుంచి కొంతైనా వారిని దూరంగా ఉంచొచ్చు. కొంతమంది పిల్లలు క్యారెట్ కలిగిన ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు. అయితే అలాంటి వారి కోసం మేము ఈరోజు అద్భుతమైన క్యారెట్ రైస్ రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఈ రెసిపీని క్రమం తప్పకుండా పిల్లలకు లంచ్‌గా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈ క్యారెట్ రైస్ రెసిపీని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


క్యారెట్ రైస్ రెసిపీకి కావాల్సిన:
2 కప్పుల బియ్యం
3 కప్పుల నీరు
2 టేబుల్ స్పూన్ల నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు
1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
1/4 టీస్పూన్ గరం మసాలా
2 కప్పుల తురిమిన క్యారెట్
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 కప్పు కొత్తిమీర


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యాన్ని పోసుకొని.. వాటిని బాగా శుభ్రం చేసి, 30 నిమిషాల పాటు నానబెట్టండి.
ఆ తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని అందులో  నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవలసి ఉంటుంది.
అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి.
ఆ తర్వాత అందులోని పసుపు, కారం, గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాల్సి ఉంటుంది.
ఇలా వేయించుకున్న తర్వాత తురిమిన క్యారెట్ వేసి 5 నిమిషాలు వేయించాలి.
ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక అదే కళాయిలో నానబెట్టిన బియ్యం, నీరు వేసి బాగా కలపాలి.
కళాయిపై మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి. అంతే సులభంగా క్యారెట్ రైస్ రెడీ అయినట్టే.. ఇలా రెడీ అయిన తర్వాత కొత్తిమీర చల్లి కలపాలి.


చిట్కాలు:
ఈ క్యారెట్ రైస్ రుచిని పెంచడానికి 1/4 కప్పు బఠానీలు లేదా మిరపకాయలు కూడా వేయవచ్చు.
క్యారెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేయవచ్చు.
ఈ క్యారెట్ రైస్ రెసిపీలో పెరుగు లేదా చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి