New Covid-19 Symptoms: కరోనా కొత్త లక్షణాలు ఏంటో తెలుసుకోండి..
COVID-19 Update: కోవిడ్-19 పేషెంట్స్ లో ప్రతీ రెండునెలలకు ఒకసారి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కోవిడ్-19 ( Covid-19 ) నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.. అవి మెదడుపై ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.
COVID-19 Update: కోవిడ్-19 పేషెంట్స్ లో ప్రతీ రెండునెలలకు ఒకసారి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కోవిడ్-19 ( Covid-19 ) నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.. అవి మెదడుపై ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.READ ALSO | Covid-19 Vaccine: మార్చిలో 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ
కరోనావైరస్ ( Coronavirus ) అంటే కేవలం జలుబు దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిత్యం కొత్త లక్షణాలు బయటికి వస్తున్నాయి. మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత కోవిడ్ -19 టెస్టులో నెగెటీవ్ వచ్చినా పూర్తిగా కోలుకున్నట్టు కాదు అంటున్నారు వైద్యులు. కరోనావైరస్ సోకిన వారికి మరిన్ని వైరస్ లు సోకే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయట. ఇక కొత్త లక్షణాలను గమనిస్తే..ALSO READ| Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
బ్రెయినక్ ఫాగింగ్
ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పు, విటమిన్ బీ-12 లోపం, కొన్ని స్ట్రాంగ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫాగింగ్ ( Brain Fogging) పరిస్థితి ఏర్పడుతుంది. మీకు మైగ్రేయిన్స్, డీ హైడ్రేషన్, డిప్రెషన్ కలిగినా మీకు బ్రెయిన్ ఫాగ్ సమస్య రావచ్చు. కరోనాసోకి తేరుకున్న వారికి బ్రెయిన్ ఫాగింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందట. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రడించడం మంచిది.ALSO READ| Immunity Booster Tea: ఇమ్యూనిటీని పెంచే అల్లం పసుపు ఛాయ్
బ్రెయిన్ ఫాగింగ్ చికిత్స
మీకు ఉన్న లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే ఐరన్ సప్లిమెంట్స్ సూచిస్తారు వైద్యులు. ఇలా లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.
నివారణ చర్యలు
బ్రెయిన్ ఫాగింగ్ సమస్యను ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి నివారించవచ్చు. అందులో ముందుగా మీరు చేయాల్సిందల్లా చక్కగా నిద్రపోవడం. దాంతో పాటు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దాని కోసం యోగాసనాలు చేయవచ్చు. ప్రాణాయామం చేయవచ్చు. చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఒకరకంగా చెప్పాలి అంటే మెదడుకు విశ్రాంతిని ఇవ్వండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR