Custard apple in skincare routine: ఈ సీజన్లో మార్కెట్లో సీతాఫలం పనులు కనిపిస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్య పరంగా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని మన స్కిన్ కేర్ రొటీన్‌లో జత చేసుకోవడం వల్ల రెట్టింపు నిగారింపు పొందుతారు. దీంతో మీ స్కిన్ పట్టులో మెరుస్తుంది. స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకుంటాం. దీంతో మృదువైన ముఖం సొంతం అవుతుంది. అయితే ఈ సీతాఫలంలో కూడా ముఖానికి ఉపయోగిస్తే ఇందులోని విటమిన్స్ యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి పట్టులా మెరిసేలా చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీతాఫలం పండు చూడటానికి క్రీమి టెక్చర్ లో తీయ్యగా ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, సీ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఎన్ని పోషకాలు కలిగిన సీతాఫలం కచ్చితంగా చలికాలంలో తినాల్సిందే. ఇందులో అన్ని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీతాఫలం ఐస్ క్రీమ్ వివిధ డెజర్ట్ రూపంలో కూడా తీసుకుంటారు. ఈ పండుగ నేరుగా కూడా తినవచ్చు.


సీతాఫలం డైట్ లో చేర్చుకోవడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా మాయిశ్చర్ గా ఉంటుంది. రోజంతటికి కావలసిన హైడ్రేషన్ అందుతుంది ఎంతో చర్మం పొడిబారటం పొట్టుగా రాలడం వంటి సమస్య తగ్గిపోతుంది. పుష్కలంగా ఉంటాయి.  సీతాఫలం లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా కాపాడుతుంది. సెల్ డామేజ్ కానివ్వదు సీతాఫలం పండు వల్ల ముఖ్యంగా ఎగ్జిమా అనే సమస్య రాకుండా నివారిస్తుంది చూడడానికి కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.


స్కిన్ కేర్ రొటీన్..
స్కిన్ కోర్ రొటీన్ లో సీతాఫలం చేర్చుకోవాలంటే స్క్రబ్ మాదిరి ఉపయోగించవచ్చు. సీతాఫలం గింజలను తీసేసి గుజ్జుని  మాత్రం పేస్టు చేసుకోవాలి. ఇందులో షుగర్ పొడి వేసుకొని ముఖానికి స్క్రబ్ లా సర్క్యులర్ మోషన్ లో రుద్దాలి. ఇలా చేసిన ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


ఇదీ చదవండి: నల్లటి ఎండుద్రాక్షల్లో నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఈరోజు డైట్‌లో చేర్చుకుంటారు..


ఫేస్ మాస్క్..
సీతాఫలం గుజ్జులో తేనె వేసుకొని ముఖానికి ఫేస్ మాస్క్ కూడా ఉపయోగించవచ్చు. వారానికి ఒక రెండు సార్లు ఇది ఉపయోగించిన ముఖం హైడ్రేటెడ్ గా పట్టుల మెరుస్తుంది. ఈ ఫేస్ మాస్క్ వేసుకున్న అరగంట అలాగే ఉండాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో చేసుకోవాలి.


ఇదీ చదవండి:  ఆముదం బట్టతలపై కూడా జుట్టుమొలిపించే అద్భుత వరం.. చర్మానికి కూడా బోలెడు లాభాలు..


జిడ్డు చర్మం ఉన్నవాళ్లు సీతాఫలం గుజ్జులో నిమ్మరసం వేసుకొని ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఇది వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఓ అరగంట ఆరనిచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు ఏ ఫేస్ మాస్క్ మీ ముఖంపై ఉపయోగించిన ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి ఒక 24 గంటలు ముందు ఫేస్ కి అప్లై చేసిన తర్వాత అది మొఖం అంతటి భాగాలకు ఉపయోగించాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.