Black Raisins: నల్లటి ఎండుద్రాక్షల్లో నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఈరోజు డైట్‌లో చేర్చుకుంటారు..

Black Raisins 5 Health Benefits: మార్కెట్లో ఎక్కువ శాతం మనము పసుపు రంగులో ఉండే ఎండుద్రాక్షలను చూస్తాం, వీటిని విపరీతంగా వినియోగిస్తాం. అయితే ఎక్కువ శాతం నల్లటి ఎండుద్రాక్షలను మనం వినియోగించం. అయితే ఇందులో పచ్చ రంగులో ఉండే ఎండుద్రాక్షల కంటే అధిక ప్రయోజనాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Nov 10, 2024, 12:58 PM IST
Black Raisins: నల్లటి ఎండుద్రాక్షల్లో నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఈరోజు డైట్‌లో చేర్చుకుంటారు..

Black Raisins 5 Health Benefits: ఈ నల్లటి ఎండుద్రాక్షలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అలాగే ప్రయోజనాలు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది ఎంతో ముఖ్యం. రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఇలా ఉదయం తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలగడంతో పాటు అజీర్తి వంటి సమస్యలు మీ దరిచేరవు. ఎండు ద్రాక్షలు నానబెట్టిన నీటిని కూడా వడకట్టుకొని తీసుకోవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

నల్ల ద్రాక్షలను డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్లిపోతాయి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మన కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అంతేకాదు నల్లటి ఎండు ద్రాక్షలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్త లేని సమస్యకు ఇది ఎఫెక్ట్ చేయకుండా కాపాడుతుంది. ఎనిమియా వల్ల మనం వీక్ అయిపోతాము కాబట్టి ఎండు ద్రాక్ష శరీరంలో బ్లడ్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది.

నల్లటి ఎండు ద్రాక్షాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. సెల్ డామేజ్ కాకుండా ఉంటుంది. ఇది రెగ్యులర్గా నల్లటి ద్రాక్షాలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య సమస్యలు త్వరగా మీ దరి చేరవు. నల్లటి ఎండు ద్రాక్షలు మీ పిల్లలకు కూడా తరచుగా ఇవ్వటం వల్ల వాళ్ళ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇదీ చదవండి: ఆముదం బట్టతలపై కూడా జుట్టుమొలిపించే అద్భుత వరం.. చర్మానికి కూడా బోలెడు లాభాలు..

ప్రతిరోజు కొంత మేర ఎండ ద్రాక్షాలు వాళ్ళ డైట్ లో చేర్చాలి. అంతేకాదు పెద్దవారు కూడా నల్లటి ఎండు ద్రాక్షాలు నానబెట్టి ఉదయం తీసుకోవాలి. పిల్లలకు స్నాక్స్ రూపంలో ఎండుద్రాక్షలు ఇవ్వచ్చు అంతేకాదు వివదు రూపంలో మన డిషెస్ లో నల్లటి ఎండు ద్రాక్షలను ఉపయోగించాలి దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఆరోగ్యపరంగా కానే కాదు సౌందర్య పరంగా కూడా నల్లటి ఎందుకు ద్రాక్షాలు అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి.

ఇదీ చదవండి: దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్‌  

 మన చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది నిత్య యవ్వనంగా ఉంటారు. సెల్ డ్యామేజ్ కాకుండా యూవి కిరణాలకు షీల్డ్ ల ఇవి కాపాడతాయి. కాబట్టి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చేర్చుకోవాల్సిందే. బయటకు వెళ్లినప్పుడు హానికర సూర్యుని యూవీ కిరణాల మన చర్మం ఎండకాలంలో పర్మనెంట్‌ డ్యామేజ్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మనం బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ ముఖానికి అప్లై చేసుకుని వెళతాం. అయితే డైట్‌లో కూడా నల్లటి ఎండు ద్రాక్ష చేర్చుకోవడం వల్ల ఇవి శరీరంల లోపలి నుంచి రక్షణ అందిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News