Diwali: స్వీట్లు తినకపోతే ఎలా ? షుగర్ పేషెంట్లు ఏం తినాలి ? ఈ టిప్స్ పాటించండి చాలు
దీపావళికి ఇంకో రెండ్రోజులే మిగిలింది. మార్కెట్లో..ఇళ్లలో వివిధ రకాల తీపి పదార్ధాలు, పిండి వంటలు నోరూరించడానికి సిద్ధమయ్యాయి. మరి డయాబెటిస్ పేషెంట్ల పరిస్థితి ఏంటి..ఏది తినవచ్చు..ఏది తినకూడదు..ఈ టిప్స్ పాటిస్తే..షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినేయవచ్చు మరి.
దీపావళికి ( Diwali ) ఇంకో రెండ్రోజులే మిగిలింది. మార్కెట్లో..ఇళ్లలో వివిధ రకాల తీపి పదార్ధాలు, పిండి వంటలు నోరూరించడానికి సిద్ధమయ్యాయి. మరి డయాబెటిస్ పేషెంట్ల ( Diabetes Patients ) పరిస్థితి ఏంటి..ఏది తినవచ్చు..ఏది తినకూడదు..ఈ టిప్స్ పాటిస్తే..షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినేయవచ్చు మరి.
పండుగల వేళ..ముఖ్యంగా దీపావళికి స్వీట్లంటే ( Diwali Sweets ) అమితంగా మోజు పడతారు అంతా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దీపావళి పండుగ హడావిడి ప్రారంభమైంది. ఇళ్లలో చేసిన స్వీట్లు కావచ్చు..మార్కెట్లో నోరూరిస్తూ కన్పిస్తున్న తీపి పదార్ధాలు కావచ్చు. తెగ టెంప్ట్ చేస్తుంటాయి. సరే తిందాం కదా అనుకుంటే..డయాబెటిస్ ఉంది కదా ఎలా. స్వీట్లపై మక్కువను చంపుకోలేరు. అలాగని మనసారా తినలేకుండా ఉండలేకపోతారు. అందుకే ఈ టిప్స్ పాటిస్తే చాలు. హాయిగా ఆరగించేయవచ్చు.
ఇదంతా ఎందుకంటే...దీపావళి నాడే ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం ( World Diabetes day ) ఉంది మరి. ద్యావుడా..ఏం చేయాలి మరి. ఓ వైపు డయాబెటిస్ వెంటాడుతోంది. మరోవైపు స్వీట్లు నోరూరిస్తున్నాయి. .ఇంకో రెండ్రోజుల టైమ్ మిగిలింది. ఫర్వాలేదు. డయాబెటిస్ పేషెంట్లు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవచ్చు. Also read: Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి!
తెల్లబియ్యంతో వండిన అన్నం వైపు కన్నెత్తు కూడా చూడకండి. ఇందులో గ్లైసెమిక్ అధికంగా ఉంటుంది. ఇది స్వీట్లు తినాలని ఎంకరేజ్ చేస్తుంది. బ్రౌన్ రైస్ ( Brown rice )తో అన్నం వండుకోండి. ఇక చాక్లెట్ తినాలన్నా తినవచ్చు. కానీ దయచేసి డార్క్ చాక్లెట్ ( Dark Chocolate ) మాత్రమే తినండి. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువే ఉంటుంది.
పండుగ వేళ కదా..బందుమిత్రులంతా వస్తారు. అతిధి మర్యాదలకు 3-4 బ్రాండ్ల డ్రింక్స్ ఉంటాయి. తాగకుండా ఉండలేం కదా. నిజమే..ముట్టుకుంటే ప్రమాదమే. ముట్టుకోకండి. దాహంగా ఉంటే.. కొబ్బరినీళ్లు, నిమ్మకాయ రసం తాగండి.
అన్నట్టు..ఇంట్లో ఉండే స్పైసీ స్నాక్స్ కూడా షుగర్ పేషెంట్లకు మంచిది కాదు. ఇవి హార్మోన్స్ ను ప్రేరేపిస్తాయి. అందుకే వీటికి బదులుగా వాల్ నట్స్, డ్రైడ్ సీడ్స్, పండ్లతో కడుపు నింపుకునే ప్రయత్నం చేయండి. పౌష్టికాహారం కూడా సమకూరుతుంది.
ఇంట్లో చుట్టాలొచ్చి ఉన్నారు కదా.. మంచి వంటకాలు కూడా ఉన్నాయని..రెండు పెగ్గులు ( Say no to liquor on Diwali ) వేద్దామనుకుంటే అసలుకే ప్రమాదం. ఆ ఆలోచనే రానీయవద్దు. ఆల్కహాల్ మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచేస్తుంది. కొత్త సమస్యలు వచ్చి చేరుతాయి.
లేదు..కంట్రోల్ చేసుకోలేక పొరపాటున తీపి పదార్ధాలు తినేశారా..ఏం చేయాలా అని అలోచిస్తున్నారా..దీనికీ ఓ పరిష్కారముంది. కాస్సేపాగి..కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగండి. బ్యాలెన్స్ అవుతుంది. ఆరోగ్యమే మహా భాగ్యం కదా తప్పదు మరి. ఆఖరిగా చెప్పేది ఒకటే. ఏది తిన్నా..తినకపోయినా రోజు ఓ అరగంట సేపు వ్యాయామం మాత్రం మర్చిపోవద్దు. అది మీ శరీరాన్ని కంట్రోల్ చేసి ఉంచుతుంది. Also read : Happy Diwali 2020 Greetings: వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దీపావళి గ్రీటింగ్స్