Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి!

Things To Do on Dhanteras | దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి 2020 కోసం వేచి చూస్తున్నారు. మార్కెట్లో సందడి కనిపిస్తోంది. దాంతో పాటు ప్రజలు ఈ మధ్య బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. తమ ప్రియమైన వారికోసం మిఠాయిలు కొంటున్నారు.

Last Updated : Nov 11, 2020, 08:27 PM IST
    1. దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి 2020 కోసం వేచి చూస్తున్నారు.
    2. మార్కెట్లో సందడి కనిపిస్తోంది. దాంతో పాటు ప్రజలు ఈ మధ్య బహుమతులు కొనుగోలు చేస్తున్నారు.
    3. తమ ప్రియమైన వారికోసం మిఠాయిలు కొంటున్నారు.
Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి!

Dhanatrayodashi 2020 | దీపావళి సందర్భంగా ధనత్రయోదశిని కూడా చేసుకుంటారు. దీపావళికి (Diwali 2020 ) రెండు రోజుల తరువాత కుబేరుడి ధనత్రయోదశిని (  Dhantrayodashi ) చేసుకుంటారు. ఈసారి నవంబర్ 13న శుక్రవారం నాడు ధనత్రయోదశిని చేసుకోనున్నారు. ధనత్రయోదశి అనే పదంలో రెండు పదాల అర్థం ఉంది. ధన+త్రయోదశి అంటే ధన+13వ రోజు. ఈ పవిత్రమైన రోజు పాటించాల్సిన విషయాలు ఇవే. ముఖ్యంగా ఈ రోజు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.

Also Read | Diwali 2020 Wishes: సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ లో షేర్ చేయడానికి దీపావళి విసెష్

27 నిమిషాల దివ్యముహూర్తం
ఈ సంవత్సరం నవంబర్ 13వ తేదీన సాయంత్రం 5.32 నిమిషాల నుంచి 5.59 ని వరకు ధనత్రయోదశి ముహూర్తం ఉంది. ఈ 27 నిమిషాల పాటు పూజలు చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈరోజున దీపాలను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. 

వీటిని దానం చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది

బట్టల దానం
ధనత్రయోదశి రోజు బట్టలు, విగ్రహాలను దానం చేయడం అనేది అమూల్యమైన బహుమతి ఇవ్వడం లాంటిదే. అందుకే ఈ రోజు బట్టలు దానం చేయడం తప్పనిసరి చేశారు. అవససరం ఉన్నవారికి బట్టలు దానం చేయడం మరింత అవసరం. ఇది మీకు మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట సంపద పెరుగుతుంది. లక్ష్మీ దేవీ ప్రసన్నం అవుతారు. ధన లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

అన్నదానం
ధంతెరాస్ ( Dhanteras) రోజు అన్నదానం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పాయసం, పూరిని దానం చేయాలి. లక్ష్మీ పూజలో మనం పాయసాన్ని ఎలాగూ తయారు చేస్తాం. ఇంటికి అతిథులను పిలవడం లేదా గుడికి వెళ్లి దానం చేయడం వంటివి చేయవచ్చు. అన్నదానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతారు.

కొబ్బరి, మిఠాయిలు
కొబ్బరిని షిఫాలా  (  Shifala ) అని కూడా అంటారు. ఏ పూజ అయినా కొబ్బరి ( Coconut ) లేకుండా జరగదు. కొబ్బరితో పాటు మిఠాయిలు కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆనందం సిద్ధిస్తుంది. 

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

చేయకూడనివి
ధనద్రయోదశి రోజు ఇనుము ( Iron )  కొనుగోలు చేయరాదు. లేదా ఇనుముతో తయారు చేసిస ఏ వస్తువునూ కొనుగోలు చేయరాదు. అయితే ఈ రోజు ఇనుముతో చేసిన వస్తువులు దానం చేయవచ్చు. విగ్రహదానం చేయడం మరీ మంచిది. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం దూరం అవుతుంది. అదృష్టం వరిస్తుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News