DIY Lip Blam: ఇంట్లోనే సింపుల్‌గా ఖర్చులేకుండా లిప్‌బామ్ ఇలా తయారు చేయండి!
Homemade Lip Blam Idea: చలికాలంలో పెదాలు పొడిబారడం లేదా పగుళ్లు కలడం వల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ఇంట్లోనే సులభంగా లిప్‌బామ్ తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే వాటికంటే ఇవి ఎంతో సురక్షితమైనవి.
Homemade Lip Blam Idea: చలికాలంలో చర్మసంరక్షణ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ కాలంలో పెదాలు ఎక్కువగా పగుళ్లు లేదా పొడిబారడుతుంటాయి. చాలా మంది మార్కెట్‌లో లభించే క్రీములు, లిప్ బామ్‌లను ఉపయోగిస్తారు. కానీ వీటిలో హానికరమైన కెమికల్స్‌ను ఉపయోగిస్తారు. దీని వల్ల పెదాలు మరింత పొడిబారుడుతాయి. కానీ ఎలాంటి ఖర్చులేకుండా ఇంట్లోనే సులభంగా లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని పదార్థాలు, వస్తువులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసిన లిప్‌బామ్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. సహాజమైన లిప్‌బామ్ కోసం బీట్‌రూట్ ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదాలను మృదువుగా చేయడంతో పాటు, వాటి రంగును మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్ లిప్ బాప్‌ను ఇంటి వద్ద సహజమైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు.
బీట్‌రూట్ లిప్ బామ్ ప్రయోజనాలు:
పెదవులను మృదువుగా చేస్తుంది: బీట్‌రూట్‌లోని విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు పెదాలను మృదువుగా మెత్తగా చేయడంలో సహాయపడతాయి.
పెదాలకు రంగును అందిస్తుంది: బీట్‌రూట్‌లోని రంగు పదార్థాలు పెదాలకు సహజమైన గులాబీ రంగును అందిస్తాయి.
పెదాలను తేమగా ఉంచుతుంది: తేనె, నూనెలు పెదాలను తేమగా ఉంచి, పొడిబారడాన్ని నివారిస్తాయి.
పెదాలను రక్షిస్తుంది: బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పెదాలను ఉదాతుల నుంచి రక్షిస్తాయి.
బీట్ రూట్ లిప్ బాప్ తయారీకి కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ రసం
తేనె
నల్లజీలకర్ర నూనె
విటమిన్ E క్యాప్సూల్
పెద్ద గిన్నె
చిన్న గిన్నె
స్పాచులా
చిన్న కంటైనర్
తయారీ విధానం:
ఒక చిన్న బీట్‌రూట్ తీసుకొని క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కోసి, బ్లెండర్‌లో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. పెద్ద గిన్నెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నల్లజీలకర్ర నూనె మరియు ఒక విటమిన్ E క్యాప్సూల్ నుండి నూనెను తీసి కలపాలి. ముందుగా తయారు చేసిన బీట్‌రూట్ రసాన్ని మిగతా మిశ్రమంలో కలిపి బాగా కలపాలి. తయారైన మిశ్రమాన్ని ఒక చిన్న కంటైనర్‌లో నింపి చల్లటి ప్రదేశంలో ఉంచాలి. పెదాలు పొడిగా ఉన్నప్పుడు ఈ లిప్ బామ్‌ను వేళ్లతో తీసుకొని పెదాలకు అప్లై చేయాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఉపయోగించవచ్చు.
గమనిక:
ఇంటి వద్ద తయారు చేసిన ఈ లిప్ బామ్‌ను రెఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది.
చర్మం అలర్జీ ఉన్నవారు ఈ లిప్ బామ్‌ను ఉపయోగించే ముందు చిన్న మొత్తంలో చేతిపై పరీక్షించుకోవాలి.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter