Do Not Google It: ఆధునిక కాలంలో మనం దేని గురించైనా తెలుసుకోవాలంటే.. ప్రతిఒక్కరూ గూగుల్ లోనే సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. అందులో మీరు దేని గురించి అడిగినా క్షణాల్లో మీ ముందు ఉంచుతుంది. కానీ, గూగుల్ లో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేయడం నిషిద్ధమని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే.. కొన్ని విషయాల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే మీరు జైలు శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఇంతకీ ఆ నిషిద్ధ విషయాలు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. అశ్లీలత


చాలా మంది వ్యక్తులు గూగుల్‌లో అశ్లీల సైట్‌లను సందర్శిస్తారు. కానీ, గూగుల్ లో చైల్డ్ పోర్న్ గురించి సెర్చ్ చేయడం నిషిద్ధం. ఎందుకంటే ఈ విషయంలో భారతదేశంలో చట్టం ఉంది. పోక్సో చట్టం 2012, 14 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించడం, సృష్టించడం లేదా కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం. ఈ కేసులో ప్రభుత్వం మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని కోసం మీకు 5 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


2. బాంబును ఎలా తయారు చేయాలి?


బాంబును ఎలా తయారు చేయాలి? అని గూగుల్‌ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ చేయకండి. అలా చేస్తే మీ కంప్యూటర్ సెక్యూరిటీ ఏజెన్సీల రాడార్ కిందకు వెళ్లిపోతుంది. మిమ్మల్ని మీరు ఇంటెన్సివ్ మానిటరింగ్‌కు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమాచారం కోసం ఎప్పుడూ చూడకండి.


3. అబార్షన్


గూగుల్‌లో అబార్షన్ గురించి వెతకడం నిషిద్ధం. ఎందుకంటే భారతదేశంలో సరైన వైద్యుని అనుమతి లేకుండా అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం. గూగుల్‌కు దాని గురించి సమాచారం ఉన్నప్పటికీ.. దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం వల్ల మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.  


Also read: Girls Expenses: అమ్మాయిలు ఈ వస్తువుల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారట!


Also Read: Mothers Day 2022: మదర్స్ డే స్పెషల్ విషెస్.. ఈ రోజంతా అమ్మతోనే సరదాగా గడిపేద్దాం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.