Foods Not To Eat With Alcohol: ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా చాలా మంది రిలాక్స్‌ అవుడానికి మద్యం సేవిస్తున్నారు. దీని తీసుకోవడం వల్ల ప్రశాతం, ఒత్తిడి తొలగిపోతుందని భావిస్తారు. అయితే కొంతమంది మద్యంతో పాటు స్టఫ్‌ని కూడా తీసుకుంటారు. మద్యం లెవర్స్‌లాగా స్టఫ్‌ లెవర్స్‌ కూడా ఉంటారు. స్టఫ్‌ లేనిదే వీరు మద్యం తీసుకోరు. అయితే స్టఫ్‌ అంటే ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకుంటారు. దీని వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత తీవ్రమైన ఇబ్బందుల బారిన పడాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం తీసుకొనేవారు ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్‌, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, గుండెలో మంట వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..


మద్యం తాగేటప్పుడు తినకూడని ఆహారాలు:


1. చాక్లెట్: 


చాక్లెట్‌లో ఉండే టైరామైన్ అనే పదార్థం ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.


2. పిజ్జా: 


పిజ్జాలో ఉండే కొవ్వు పదార్థాలు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.


3. ఫ్రెంచ్ ఫ్రైస్: 


ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉండే అధిక ఉప్పు, కొవ్వు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది.


4. ఊరగాయలు: 


 ఊరగాయలలో ఉండే ఎక్కువ ఉప్పు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే నిర్జలీకరణకు దారితీస్తుంది.


5. కెఫిన్ : 


కెఫిన్ ఉన్న పానీయాలు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది.


6. బీన్స్, కాయధాన్యాలు: 


బీన్స్, కాయధాన్యాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మద్యంతో పాటు తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.


7. పాల ఉత్పత్తులు: 


పాల ఉత్పత్తులు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తాయి.


8. చక్కెర పదార్థాలు:


 చక్కెర పదార్థాలు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తాయి.


9. ఖాళీ కడుపుతో మద్యం తాగడం: 


ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల ఆల్కహాల్ శరీరంలోకి త్వరగా శోషించబడి మత్తు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


10. అధికంగా తినడం: 


మద్యం తాగేటప్పుడు అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.


మద్యం తాగేటప్పుడు తినాల్సిన ఆహారాలు:


తాజా పండ్లు, కూరగాయలు,గుడ్లు,సాల్మన్,గింజలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. 


మద్యంతో పాటు స్టఫ్‌గా తీసుకోవాల్సి పదార్ధాలు: 


ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్రూట్స్ కు తీసుకోవడం చాలా మంచింది. 


ముఖ్యంగా ఫైబర్ ను కలిగిన పదార్థాలు తినడం వల్ల  శరీరంపై చెడు ప్రభావం ఉండదు.


ప్రోటీన్లు కలిగిన ఆహారంలో భాగంగా చికెన్, చేపలు వంటివి మద్యం తాగేటప్పుడు తీసుకోవచ్చ దీని వల్ల ఎలాంటి నష్టం కలగదు.


మద్యం తాగేవారు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆవకాడో, ఆలివ్ ఆయల్  తీసుకోవడం మంచిది. 


ఫైబర్ కలిగిన  పదార్థాలైనా మద్యం తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు. 


ఇలాంటి  ఆహారం పదార్ధాలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పైన చెప్పిన వాటిని తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter