Guava For Health Benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జామపండు వర్షకాలంలో తినడం వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయని చాలా మంది భావిస్తారు. జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి , దీని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు కలుతాయా? ఈ విషయాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జామపండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. జామపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  వర్షకాలంలో రోగల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దలు వివిధ సమస్య బారిన పడుతుంటారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పోషకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు జామపండు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల వర్షకాలంలో కలిగే జలుబు, దగ్గు వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. 


విటిమిన్‌ సి పాటు ఇందులో ఎ కూడా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాత్రిపూట కంటి సమస్యలు ఉన్నవారు ఈ పండును తీసుకోవడం వల్ల చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో కూడా జామపండు సహాయపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది. గ్యాస్‌, ఊబరం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు జామపండును తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


ఫ్రీ రాడికల్స్‌ శరీరానికి నష్టం కలిగిస్తాయి.  ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టడానికి జామపండు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రాడికల్స్‌ను తొలగించంలో ఎంతో మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారికి జామపండు ప్రత్యేకంగా మంచిదని వైద్యులు చెబుతున్నారు. 


డయాబెటిస్‌  ఉన్నవారు జామపండు తినడం వల్ల వచ్చే లాభాలు:



జామపండులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా సహాయపడుతుంది.  జామపండులోని యాంటీఆక్సిడెంట్లు మధుమేహంతో సంబంధం ఉన్న  చక్కెర వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.


అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:


జామపండును బాగా శుభ్రం చేసుకుని తినండి.
ఎక్కువగా జామపండు తినడం వల్ల విరేచనాలు కావచ్చు, కాబట్టి మితంగా తినండి.


ముగింపు:


వర్షాకాలంలో జామపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పోషకాలకు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికి ప్రత్యేకంగా మంచిది. మీరు ఈ పండు తీసుకోనే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి