Dry Cough: పొడి దగ్గు నుంచి ఉపశమనానికి అద్భుతమైన చిట్కా తప్పకుండా పాటించండి!!
Dry Cough Home Remedies: పొడి దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ రెమిడీ మీరు ఎంతో మేలు చేస్తుంది. పాలు, ఖర్జూరం కలిపిని పాలను రాత్రి తీసుకోవడం వల్ల పొడి దగ్గుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Dry Cough Home Remedies: సాధారణంగా చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పొడి దగ్గు సమస్య కారణంగా గొంతు చికాకుగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలని అనుకొనేవారు కేవలం రెండు పదార్థాలతో ఉపశమనం పొందవచ్చు. ఈ రెమిడీతో గొంతు చికాకు తగ్గుతుంది. పొడి దగ్గు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు.
పొడి దగ్గు ఎందుకు వస్తుంది?
జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పొడి దగ్గుకు సాధారణ కారణం. కొన్ని సార్లు పుప్పొడి, దుమ్ము, జంతువుల రోమాలు వంటి అలెర్జీలు దగ్గు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ధూళి, పొగ, రసాయనాలు వంటి పర్యావరణ కాలుష్యం కూడా దగ్గుకు దారితీస్తుంది. శ్వాసనాళాల వాపు, ఇరుకు వల్ల దగ్గు వస్తుంది. కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు కూడా దీర్ఘకాలిక పొడి దగ్గుకు కారణం కావచ్చు.
పొడి దగ్గు లక్షణాలు:
గొంతులో దురద, గొంతు నొప్పి, ఛాతిలో బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పొడి దగ్గును తగ్గించడంలో ఖర్జూరం, పాలు ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖార్జూరంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే పాల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల గొంతు ఇన్షెక్షన్‌లు, నొప్పి తగ్గుతాయి. ఇది కేవలం గొంతు సమస్య మాత్రమే కాకుండా ఊపిరితిత్తుల్లో కలిగే ఇబ్బందిని కూడా తగ్గిస్తుంది. చలికాలంలో చాలా మంది ఊపిరితిత్తులో శ్లేష్మం తో ఇబ్బంది పడుతారు. కానీ పాలు, ఖర్జూరం కలిపి పానీయం తీసుకోవడం వల్ల శ్లేష్మం పూర్తిగా క్లీయర్ అవుతుంది.
ఈ పానీయం ఎలా తయారు చేసుకోవాలి:
కావాల్సిన పదార్థాలు: రెండు ఖర్జూరాలు, ఒక గ్లాస్ పాలు
తయారీ విధానం: ముందుగా ఖర్జూరాలను నీటితో శుభ్రంగా కడగాలి. మరో గిన్నెలో పాలు తీసుకోవాలి ఇందులోకి ఖర్జూరాలను కలుపుకోవాలి. ఇప్పుడు మంట మీద పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆ తరువాత పాలను గోరువెచ్చగా తాగాలి. ఈ పానీయాన్ని రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవడం చాలా మంచిది.
పాలు, ఖర్జూరం ఎవరు తినకూడదు?
ఆయుర్వేద నిపుణులు ప్రకారం పాలు, ఖర్జూరం కలిపిని పానీయాని డయాబెటిస్ ఉన్న రోగులు తీసుకోకూడదు. ఇందులో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా దీని తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.