Fibromyalgia Syndrome: ప్రస్తుతం కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనులు చేయడం కారణంగా చాలామంది  తీవ్ర ఒత్తిడితో పాటు ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి గురవుతున్నారు. ఇది సాధారణ వ్యాధి అయినప్పటికీ దీనికి కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఫైబ్రోమైయాల్జియా కారణంగా కండరాలు, కీళ్లు, శరీరంలోని వివిధ భాగాల్లో తీవ్ర నొప్పులు వస్తున్నాయి. దీంతోపాటు చాలామందిలో అలసట, బద్ధకం కూడా వస్తూ ఉంటుంది. తరచుగా ఈ సమస్య బారిన పడితే రోజు చేసే పనులు మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబ్రోమైయాల్జియా బాధపడే వారిలో నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 15 అడుగులు వేయగానే అలసటకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా బరువును ఎత్తే సమయంలో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలోన అయితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలేంటో? ఈ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఫైబ్రోమైయాల్జియా రావడానికి ప్రధాన కారణాలు:
పని ఒత్తిడి:

కార్పొరేట్ ఆఫీసుల్లో పని ఒత్తిడి సాధారణం.. చాలామంది ఉద్యోగాలు చేస్తున్న వారు గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనులు చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో అలసట గురవుతూ ఉంటారు. అయితే దీనికి కారణంగా కూడా చాలామందిలో ఫైబ్రోమైయాల్జియా వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అతిగా కూర్చోవడం:
కార్పొరేట్ ఆఫీసుల్లో పని ఎక్కువగా ఉండడం కారణంగా ఒకే చోట ఒకే ఫోజ్ లో కూర్చుని ఉంటారు. దీని కారణంగా కూడా చాలామందిలో నడుము నొప్పి కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల కారణంగా కూడా ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి దారి తీయొచ్చు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం:
ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఒక హాబీగా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్ట్రీట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. ఇలా ప్రతిరోజు ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఫైబ్రోమైయాల్జియా పెరిగే అవకాశాలు ఉన్నాయి.


మానసిక ఒత్తిడి:
కార్పొరేట్ ఆఫీసుల్లో ఎన్ని గంటల పాటు పనిచేసిన ప్రాజెక్టులు ముందుకు వెళ్ళవు. దీని కారణంగా చాలామంది మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా కూడా చాలామందిలో ఫైబ్రోమైయాల్జియా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి