Bombay Rava Halwa Recipe: దేశమంతటా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే ఈ సారి గణేష్‌ ఉత్సవాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు జరుగుతాయి. అయితే భారతీయుల సంప్రాదాయం ప్రకారం.. వినాయకుని విగ్రహాలు మండపాల్లో ప్రతిష్ఠించి.. భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అంతేకాకుండా వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను కూడా సమర్పస్తారు. అయితే వివిధ ప్రాంతాల వారు ఆయా సాంప్రదాయకు అనుగుణంగా ప్రసాదాలను పెడుతూ ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గణేషుడికి ఇష్టమైన బొంబాయి రవ్వతో చేసిన సిరా ప్రసాదం సమర్పిస్తారు. అయితే ఈ ప్రసాదాన్ని మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలుంటాయి. కాబట్టి వారు దీనిని తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరా ప్రసాదం చేయడానికి కావలసిన పదార్థాలు:
>>నెయ్యి
>>బొంబాయి రవ్వ
>>జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష మరియు బాదం
>>తగినంత నీరు
>>చక్కెర
>>అంజీర్‌ పండ్లు
>>యాలకుల పొడి
>>కుంకుమపువ్వు
>>పాలు


తయారీ పద్ధతి:
ముందుగా సిరా చేయడానికి పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్‌ను లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించి.. తర్వాత ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి అందులో కాస్త కుంకుమపువ్వు వేసి కాసేపు అలాగే ఉంచాలి. చివర్లో ఏలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నెయ్యిలో బొంబాయి రవ్వను కూడా వేయించి పెట్టుకోండి.


ఇలా సిద్ధం చేసుకోండి:
వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను తీసుకుని.. అందులో నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి.. డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వు పాలు వేసి కలపాలి ఇలా తయారు చేసిన సిరాను గణపతికి ప్రసాదంగా పెట్టాలి.


మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం:
మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం సిరా చేసేటప్పుడు.. పంచదార వేయడానికి బదులుగా అంజీర్‌ ముక్కలను వేసుకుని.. కొంత తిపి కోసం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న దానిని మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చు.


Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..


Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook