Glowing Skin Tips: పాలు ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మం మెరుగుపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పచ్చి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాలతో చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మంలోని మలినాలను తొలగించి.. ముఖాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎలా పచ్చి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లోయింగ్ స్కిన్ కోసం పచ్చి పాలు:


పచ్చి పాలు, పిండి:
చర్మం విపరీతంగా పొడిబారినప్పుడు అందహీనంగా తయారవుతుంది. ఈ గ్లో తిరిగి పొందడానికి ఈ పచ్చి పాలతో కూడిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె 2 చెంచాల శెనగపిండిని తీసుకుని.. పచ్చి పాలు, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. అయితే ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ముఖంపై ఉంచిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.


పాలు, కుంకుమపువ్వు:


ముఖానికి సహజమైన మెరుపును తీసుకు రావడానికి కుంకుమపువ్వుతో కూడిన ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం పచ్చి పాలు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.


పాలు, తేనె:
పాలలో తేనె కలిపి కూడా చర్మానికి అప్లై చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ మిశ్రమంలో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి చర్మాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖం కోల్పోయిన గ్లో కూడా తిరిగి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పొడిబారడాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.


Also Read: Golden Globe to Naatu Naatu : నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఉబ్బితబ్బిబ్బైన చిరు.. చిన్నపిల్లాడిలా రాజమౌళి


Also Read: Chiranjeevi-Shruti Haasan : శ్రుతి హాసన్‌తో మళ్లీ మళ్లీ చేస్తాడట!.. ఏ మాత్రం ద్వేషం పెట్టుకోని చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి