White Bumps: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా..ఆరోగ్యంపైనే కాదు..అందంపై కూడా ప్రభావం పడుతుంది. ముఖంపై తెల్లటి గింజలు అందాన్ని పాడుచేస్తాయి. ఆ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఈ హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యాన్ని, అందాన్ని పాడు చేసేది చెడు ఆహారపు అలవాట్లే. ఆహారపు అలవాట్లు చెడుగా ఉంటే ముఖ చర్మంపై దుష్ప్రభావం పడుతుంది. చర్మపై డెడ్‌సెల్స్ పేరుకుపోతాయి. డెడ్‌సెల్స్ కాస్తా నెమ్మదిగా తెల్లటి గింజలుగా మారుతాయి. వీటినే వైట్ బంప్స్ అని కూడా పిలుస్తారు. వీటికి వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సువారికైనా రావచ్చు. సాధారణంగా ఇవి ముఖంపై లేదా మెడ వద్ద ఎక్కువగా వస్తుంటాయి. ఒకసారి వచ్చాయంటే చాలాకాలం ఉండే అవకాశాలున్నాయి. ఫలితంగా మీ అందం దెబ్బతింటుంది. అయితే మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ పాటిస్తే..మీ ముఖంపై ఏర్పడిన తెల్లటి గింజల్ని సులభంగా దూరం చేసుకోవచ్చు.


ఈ పరిస్థితుల్లో చర్మానికి అల్లోవెరా జెల్ రాయడం మంచి ఫలితాలనిస్తుంది. ఇందులో ఉండే యాంంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై తెల్లటి గింజల్ని నిర్మూలించడంలో సహాయపడతాయి. రాత్రి నిద్రపోయేముందు..అల్లోవెరా జెల్ రాసి మృదువుగా మస్సాజ్ చేయాలి. ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 


యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా కలిగిన చందనంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తెల్ల గింజల్ని నిర్మూలించడంతో పాటు ఆయిలీ స్కిన్, పింపుల్స్ కూడా దూరమౌతాయి. చందనం పొడిలో రోజ్ వాటల్ కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖంపై రాసుకుని..పూర్తిగా ఎండిన తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ముఖం ఎప్పుడూ శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. రోజూ ముఖాన్ని మైల్డ్ సోప్‌తో కడుగుతుండాలి. దీనివల్ల ముఖంపై పేరుకున్న దుమ్ము తొలగిపోయి..పోర్స్ తెర్చుకుంటాయి.


Also read: Sweet laddus: తీపి లడ్డూలతో స్థూలకాయానికి చెక్, డయాబెటిస్ రోగులు కూడా తినవచ్చు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook