Healthy Liver Tips: లివర్ సమస్యకు మద్యపానం కారణం కాదు..ఈ 8 అలవాట్లు మానేయండి

Healthy Liver Tips: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మద్యపానం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అయితే మద్యపానంతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణాలుగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2022, 05:51 PM IST
Healthy Liver Tips: లివర్ సమస్యకు మద్యపానం కారణం కాదు..ఈ 8 అలవాట్లు మానేయండి

Healthy Liver Tips: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మద్యపానం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అయితే మద్యపానంతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణాలుగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

సాధారణంగా మద్యం వల్లే లివర్ పాడవుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ దైనందిన జీవితంలో రోజూ మనం తెలిసో తెలియకో చేసే లేదా ఆచరించే కొన్ని పద్ధతుల వల్ల కూడా లివర్ పాడవుతుందట. ఆ అలవాట్లేంటో చూద్దాం..మనిషి శరీరంలో ప్రతి భాగానికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఏ శరీర భాగానికి దెబ్బ తగిలినా..అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శరీరంలో మరో ముఖ్యమైన అంగం లివర్. రోజూ తినే ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా..విష వ్యర్ధాల్ని మలం ద్వారా బయటకు పంపిస్తుంది. అందుకే లివర్ ఎప్పుడూ ఆరోగ్యం ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. 

ఈ క్రమంలో మద్యం అతిగా సేవించడం వల్లనే లివర్ పాడవుతుందని చాలామంది అభిప్రాయం. కానీ రోజూ చేసే వివిధ రకాల పనులు, అలవాట్ల కారణంగా కూడా లివర్ దెబ్బతింటుంది. ఆ వివరాలు మీ కోసం..

మద్యపానంతో పాటు మనలోని వివిద చెడు అలవాట్లు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణాలు. అందులో ప్రధానమైనవి సిగరెట్ స్మోకింగ్, బీడీ పీల్చడం. సిగరెట్ పొగ అనేది విషపూరితమైన రసాయనం. ఇది క్రమక్రమంగా లివర్‌లో చేరుకుని ఆక్సిడేటివ్ స్ట్రెస్ కల్గిస్తుంది. ఫలితంగా లివర్..ఫ్రీ రాడికల్స్‌ను తయారు చేస్తుంది. దాంతో లివర్ సెల్స్ దెబ్బతింటుంటాయి.

తినే ఆహారంలో స్వీట్ ఎక్కువగా ఉన్నా...లివర్ పాడవుతుంది. షుగర్ సమస్య వస్తుంది. అయితే స్వీట్స్ మానేసినంతమాత్రాన షుగర్ సమస్య తొలగిపోదు. అసలు సమస్య ఫ్రక్టోజ్‌లో ఉంటుంది. ఇది బ్రెడ్, ఐస్‌క్రీమ్, జ్యూస్, సోడాల్లో ఉంటుంది. అందుకే అటువంటి అలవాట్లుంటే మానుకోవాలి. అలా చేస్తేనే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. 

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఎక్కువగా తినేది ప్యాకేజ్డ్ ఫుడ్. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు పదే పదే చెబుతుంటారు. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది లివర్‌కు నష్టం చేకూరుస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, ఎడిటిక్స్ వినియోగిస్తుంటారు. ఇవి లివర్‌కు హాని కల్గిస్తాయి. 

కొంతమంది ప్రతి చిన్న సమస్యకు మందులు తీసుకుంటుంటారు. లేదా కొందమందికి తప్పని పరిస్థితుల్లో ఇతర అనారోగ్య కారణాలతో ఎక్కువగా మందులు వాడాల్సి వస్తుంది. ఇది ప్రమాదకరం. ఎక్కువగా మందులు తీసుకోవడం వల్ల లివర్ పాడవుతుంది. వాస్తవానికి మనం తీసుకునే ఆయుర్వేద ఔషధాలు, సప్లిమెంట్స్, మందుల్ని లివర్ విరిచే పని చేస్తుంది. కానీ కొన్ని ఇంగ్లీషు మందులు హై పవర్ కలిగినవి లివర్‌ను డ్యామేజ్ చేస్తాయి. 

సురక్షితం కాని లైంగిక సంబంధాలు కూడా లివర్‌కు చేటు తెస్తాయి. బయటివారితో సురక్షితం కాని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ సి  వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. 

ఇక మరో ముఖ్యమైన విషయం ఎక్కువ నీళ్లు తాగకపోవడం. ఎక్కువగా నీళ్లు తాగకపోయినా లివర్ ఆరోగ్యంగా ఉండదు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. అంటే 2 లీటర్ల నీరు తాగాల్సిందే. ఎక్కువ నీళ్లు తాగకపోతే లివర్ సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. 

మరో ముఖ్యమైన విషయం సరైన నిద్ర లేకపోవడం. ఇది కూడా లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. సరైన నిద్ర లేదా సుఖమైన నిద్ర లేకపోతే ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ఒకటి లివర్ డ్యామేజ్. అందుకే అవసరమైన నిద్ర చాలా అవసరం. 

Also read: Diabetes Patients: డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పూట ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేస్తే 10 రోజుల్లో షుగర్ వ్యాధికి చెక్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News