Health Benefits of Tilasi: భారతదేశ సంప్రదాయంలో దేవుడితో సమానంగా కొలిచి, పూజలు చేసే చెట్టు తులసి. వంటలలో కూడా దీని తులసి ఆకులను వాడుతుంటారు. అంతేకాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని పరచటమే కాకుండా, అందరి ఇళ్లలో దేవతగా కొలవబడే చెట్టు "తులసి". 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి ఆకులు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండటం వలన అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. వీటిలో, ఫ్లావనాయిడ్ లు, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉండి, అనేక విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే ఐరన్, విటమిన్ 'A', విటమిన్ 'C', పొటాషియం మరియు కాల్షియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది.
రోజు తులసి ఆకులను వాడటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ విశదీకరించబడింది.


Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


పంటి నొప్పి
ఎండబెట్టిన తులసి ఆకులను పొడిగా చేసి, దీనికి ఒక చెంచా ఆవాలు నూనె కలిపిన మిశ్రమాన్నినొప్పిగా ఉన్న దంతాలకు పూసి, రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి ఉదయం నుండి ఖచ్చితంగా, దంతాలలో కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.


ఆందోళన
మీరు తులసిని యాంటీ- డిప్రెషన్ ముందుగా కూడా కూడా ఉపయోగించవచ్చు. రోజు రెండు సార్లు, 10-12 తులసి ఆకులను నమలటం వలన మెదడుకు కావలసిన ఆక్సిజన్ సరఫరాను సజావుగా జరిపి, ఒత్తిడి మరియు ఆందోళనలను దూరం చేస్తుంది. 


డయాబెటిస్
ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను తీసుకొని,  రాత్రి నీటిలో నానబెట్టిన వాటికి, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉండి, ఆరోగ్యకర స్థాయిలో మధుమేహ వ్యాధిని నిర్వహిస్తాయి.


Also Read: Heavy rains in AP: భారీవర్షాల కారణంగా APలో 100 అడుగుల ముందుకొచ్చిన సముద్రం


విరామం లేకపోవటం
ఉడికించిన తులసి ఆకులను ఒక కప్పులో తీసుకొని, వీటికి తేనెను కలపండి. రాత్రి పడుకునే ముందుగా ఈ మిశ్రమాన్ని తాగండి. ఇది మీకు తక్షణ నిద్రతో పాటూ, శబ్దం(గురక) లేని నిద్రను అందిస్తుంది.  


యాంటాసిడ్ 
భోజనం తరువాత కొన్ని తులసి ఆకులను నమలండి. భోజనం తరువాత ఈ ఆకులను తినటం వలన యాంటాసిడ్ లాగా పని చేస్తాయి. అంతేకాకుండా, జీర్ణాశయంలోని భాగాలు, ఆహారంలోని పోషకాలను గ్రహించే విధంగా ప్రోత్సహించటమే కాకుండా, అల్సర్ లు కలగకుండా చేస్తుంది. 


దగ్గు
1/4 వంతు తులసి ఆకులను కలిపి తయారు చేసిన టీ ని తాగటం వలన దగ్గు నుండి ఉపశమనం కలుగుతుందని పోషకాహర నిపుణులు తెలుపుతున్నారు. ఇది ప్రభాతవంతంగా పని చేయటానికి, దీనికి తేనెను కలపండి. తేనె కలపటం వలన రుచితో పాటూ, ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి.


Also Read: Viral Video: రంగు రంగు చేపల మధ్య కూర్చొని భోంచేస్తే..?? పదండి అదెక్కడో చూద్దాం!


చెడు శ్వాస
చెడు శ్వాస లేదా మీ నోటి నుండి దుర్వాసన వస్తుందా! ఈ సమస్య వలన ఇతరులతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. నోటి నుండి వచ్చే దుర్వాసనను తొలగించటానికి గానూ, ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులకు, ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి. దీని మౌత్ వాష్ లాగా వాడండి లేదా రోజులో ఎపుడైనా ఈ మిశ్రమం ద్వారా బ్రెష్ చేసుకోవచ్చు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook