Diabetes Control Tips: ప్రస్తుతకాలంలో చాలామంది  షుగర్ వ్యాధితో బాధపడేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు షుగర్‌ని కంట్రోల్ చేయాలి. షుగర్ లెవల్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అయితే షుగర్‌ను కొంట్రోల్‌ చేయడంలో కొన్ని చిట్కాలు ఉపయోగపడుతాయి. ఈ చిట్కాలను పాటించడం  వల్ల ఏంతో మేలు  కలుగుతుంది.  దీని కోసం మీరు ఇంట్లో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోంతుది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తరుచు వంటల్లో వివిధ కూరగాయలను ఉపయోగిస్తాం. అందులో కాకరకాయను కూడా తీసుకుంటూ ఉంటాము.     అయితే చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినకుండా ఉంటారు. కానీ ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  కాకరకాయ తీసుకోవడం వల్ల షుగర్ ను ఎలా అదుపు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కాకరకాయలో కెరోటిన్‌ అనేద పదార్థం దాగి ఉంటుంది. ఈ పదార్థం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.  అంతేకాకుండా కాకరకాయను తరుచుగా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. 


Also read:  Bone Health: శీతాకాలంలో ఎముకల బలానికి తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే!


హైబీపీ సమస్యలతో బాధపడుతున్నవారు కాకరకాయ తీసుకోవడం వల్ల సమస్యను తగ్గిస్తుంది. కాకరకాయలో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుతుంది.


ముఖ్యంగా  షుగర్‌ను అదుపు చేయడంలో కాకరకాయ జ్యూస్‌ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


అంతేకాకుండా ఇంట్లో లభించే మెంతులు కూడా షుగర్‌ను అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. మెంతులను మరిగించి రసం చేసుకొని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. 


అలాగే వంటల్లో వేసుకొనే దాల్చిన చెక్క కూడా ఏంతో ఉపయోగపడుతుంది. మనం పూజించే తులసి ఆకులు కూడా షుగర్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ విధనంగా మీ షుగర్‌ను అదుపు చేయవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


Also read: Benefits Of Guava: జామతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం..నమ్మట్లేదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter