Guava in Cough And Cold: చలి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో జామ ఒకటి..వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను తినొచ్చా? వీటిని తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందా? జామను నీటిలో ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్ సి లభిస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జామపండ్ల నుంచి ఎలా ఉపశమనం లభిస్తుంది?
ఉడికించిన జామ తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే ఆవిరి శ్వాసనాళాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో సహజ చక్కెర పరిమాణాలు లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా అలసట ఉన్నవారు ఈ ఉడికించిన జామ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా గొంతు నొప్పి, నిరంతర దగ్గు, చికాకు వంటి సమస్యలను కూడా సులభంగా దూరం చేస్తుంది.
జామలో ఉండే క్వెర్సెటిన్ శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు లభిస్తాయి. ఈ లక్షణాలు జలుబు లక్షణాలను తగ్గించేందుకు కీలక పాత పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రోగనిరోధక శక్తికి పెంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉడికించిన జామను తీసుకోవాల్సి ఉంటుంది.
జామ పండును ఇలా ఉడికించండి:
ముందుగా జామను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో నీటిని పోసుకుని..ఆ కట్ చేసిన ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా కట్ చేసుకున్న ముక్కలను సుమారు 10-15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
ఇందులోనే బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుతన్న తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter