COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Herbs For Tea: ప్రతి రోజు అందరూ తమ జీవితాన్నీ టీతోనే ప్రారంభిస్తారు.  ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీలకు బదులుగా గ్రీన్‌ టీ, రెడ్ టీ, బ్లూ టీ మొదలైనవి తీసుకుంటున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు కూడా దూరమవుతాయి. ఈ హెర్బల్ టీలను ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ మూడు టీలను తీసుకొవచ్చు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ టీలను ప్రతి రోజు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


హెర్బల్ టీల వల్ల శరీరానికి కలిగే లాభాలు:
గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతో పాటు తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


పుదీనా టీ:
పుదీనా టీలో కూడా ఔషధ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా పొట్ట సంబంధింత వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


అల్లం టీ:
అల్లం టీలో శరీరానికి కావాల్సిన అనేక రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరం శక్తివంతంగా తయారవుతుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలుa


చమోమిలే టీ:
చమోమిలే టీ టీ కూడా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ టీని నిద్రపోయే ముందు తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా మారుతుంది. 


మందార టీ:
మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల అలసట వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరం కూడా యాక్టివ్‌గా మారుతుంది.


లావెండర్ టీ:
లావెండర్ టీ కూడా శరీరానికి బోలెడు లాభాలను చేకూర్చుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గించి..శరీర బరువు కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..