How To Control Diabetes In 7 Days: చాలామంది పోస్ట్ కోవిడ్ అనంతరం డయాబెటిస్ తో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా రోగనిరోధక శక్తి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మధుమేహం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఈ సమస్యల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా సూపర్ ఫుడ్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా సూపర్ ఫుడ్స్ ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ ఫుడ్స్ లో ముఖ్యంగా పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. కాబట్టి ఇవి రెండూ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది.


వీటిని ఆహారంలో తీసుకోండి:
సిట్రస్ పండ్లు:

చలికాలంలో ఈ పండ్లు ఎక్కువగా మార్కెట్లో లభిస్తాయి. ఇందులో విటమిన్ సి పరిమాణం అధిక మోతాదులో ఉంటుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచే పోషకాలు ఇందులో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. 


గుమ్మడికాయ:
చాలామంది గుమ్మడికాయను వివిధ రకాల వంటల్లో వినియోగిస్తారు. కాకుండా కొందరు దీనికి కీర్ గా చేసుకుంటారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ విటమిన్ సి ఇందులో అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకోండి.


ఉల్లిపాయలు:
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉల్లిపాయలను ఆహారంలో వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ల పరిమాణం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో వినియోగిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.


Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?


Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook