Health Tips For Drinkers: మద్యం తాగేవారికి కూడా హెల్త్ టిప్స్ ఉంటాయా ? అని ఆశ్చర్యపోకండి.. వాస్తవానికి మద్యం సేవించే అలవాటే మంచిది కాదు. అయితే ఆ అలవాటు శృతిమించనంతవరకు ఓకే అని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కానీ హద్దులు మీరి మోతాదుకు మించి మద్యం తీసుకునే వారితోనే అసలు చిక్కొచ్చిపడేది. ఆల్కాహాల్ అలవాటు ఉన్న వారు అనారోగ్యం బారిన పడటం చాలా మంది విషయంలో చూస్తుంటాం. కానీ మద్యం తాగే అలవాటు ఒక పరిమితి వరకే ఉండి, సరైన పద్ధతులను అలవర్చుకుంటే ఆల్కాహాల్‌తో వచ్చే ఇబ్బంది లేదని పలు అధ్యయనాల్లో తేలిందని చెప్పుకున్న విషయమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే.. ఆల్కాహాల్ అలవాటు ఉన్నవారిలో మహిళలకు రోజుకు ఒక డ్రింక్, పురుషులకు రోజుకు రెండు డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలట.


ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అలిసిపోయినా.. బాధ కలిగినా, ఆనందం వచ్చినా.. కష్టం, సుఖం.. ఇలా కారణాలు ఏవైనా ఎండ్ ఆఫ్ ది డే.. గొంతులో చుక్క పడనిదే తమకు రోజు పూర్తి కాదు అనే వాళ్లుంటారు. కారణాలతో పని లేదు.. కూసింత సమయం దొరికితే చాలు ఓ పెగ్గు పడాల్సిందే అనే వాళ్లూ ఉంటారు. వీళ్లనే ముద్దుగా మందుబాబులు అని కూడా పిలుచుకుంటుంటారు. తమని తాము ట్యాక్స్ పేయర్స్‌మి అని సగర్వంగా చెప్పుకుంటుంటారు అది వేరే విషయం. 


ఇవన్నీ పక్కనపెడితే.. ఆల్కాహాల్ అలవాటు ఉన్న వాళ్లు తమ ఆరోగ్యం చెడిపోకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి. అవేంటంటే..
హద్దులు దాటొద్దు : మోతాదుకు మించి మద్యం సేవిస్తే లివర్ దెబ్బ తిని ఆరోగ్యం చెడిపోతుంది. ఈ విషయం తెలిసి కూడా తప్పు చేస్తే అంతకు మించి తప్పు లేదు.


డీహైడ్రేట్ కాకుండా ఏం చేయాలంటే.. 
ఆల్కాహాల్ తీసుకునే సమయంలో మధ్య మధ్యలో నీరు కానీ లేదా నాన్-ఆల్కాహాల్ డ్రింక్స్ కానీ తీసుకుంటే శరీరం డిహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుంది. పైగా హ్యాంగోవర్ కూడా ఎక్కువ అవకుండా ఉంటుంది.


ఖాళీ కడుపుతో మద్యం మొదటికే మోసం..
ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవద్దు. మద్యం సేవించడానికంటే ముందు.. లేదా మద్యం తీసుకునే సమయంలోనే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంపై మద్యం ప్రభావం ఎక్కువగా ఉండదు. పైగా ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగే ప్రమాదం కూడా ఉంది.


మెడిసిన్స్ తీసుకునే సమయంలోనే మందు తాగడం..
మెడిసిన్స్, మందు ఒకేసారి కలిపి తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఔషదాలను, మద్యాన్ని ఏకకాలంలో తీసుకోకూడదు.  


మద్యం సేవించిన తరువాత ఇంట్లోంటి బయటికి వెళ్లాల్సి వచ్చినా.. లేదా బయటే మద్యం సేవించి ఇంటికి వెళ్లాల్సి వచ్చినా.. ఆ సమయంలో సొంతంగా వాహనాన్ని డ్రైవ్ చేయడం మానేయాలి. డ్రైవింగ్ కోసం ఇతరుల సహాయం తీసుకోవడం లేదా టాక్సీ వాహనం బుక్ చేసుకుని వెళ్లడం మంచిది. 


ఇతరులను బలవంత పెట్టడం..
కొంతమంది తాము మద్యం సేవిస్తూనే తమతో ఉన్న ఇతరులను బలవంతం చేస్తుంటారు. మద్యం అలవాటు లేని వారిని మద్యం తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం సరికాదు. అలాగే మోతాదులో మద్యం తీసుకునే అలవాటు ఉన్న వారిని మోతాదుకు మించి మద్యం తీసుకునేలా ఒత్తిడి చేయడం కూడా సరికాదు. ఆమాటకొస్తే.. అసలు మద్యం తీసుకునే అలవాటే ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి.


మద్యం సేవించే అలవాటు ఉన్న వారు తమ పరిసరాల పట్ల జాగ్రత్త వహించాలి. ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే డ్రింక్స్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, కొత్త వారిని కలిసినప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మద్యం అలవాటుకు దూరంగా ఉండటమే ఉత్తమం.


ఇది కూడా చదవండి : Bed Room Matters: శృంగారంలో పాల్గొన్న తరువాత మహిళలకు మూత్ర విసర్జన తప్పనిసరా ? ఎందుకు ?


ఇది కూడా చదవండి : Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా..? లేక బెల్లం మంచిదా..?


ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook