Cockroach Remedies: సాధారణంగా బొద్దింకలు వంట గదిలో.. ఆడవారిని ఎంతలా ఇబ్బంది పెడతాయి.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రోజులకొకసారి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగించినా సరే.. బొద్దింకల బెడద నుంచి తప్పించుకోవడం అసాధ్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ బొద్దింకలను నాశనం చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అన్నింటిలో కూడా విఫలం అవుతూ ఉంటారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా కొంచెం వంటగదిలో కానీ ఇంటి పెరటిలో కానీ చెత్త కనిపించిందంటే చాలు, అక్కడ వాలిపోతాయి.


అక్కడి నుంచి ఇల్లంతా తిరుగుతూ చికాకు పెడుతుంటాయి. ముఖ్యంగా పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఈ సమస్య ఎక్కడైనా.. ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన ప్రాంతాలలోనే ఇవి జీవిస్తాయని, అటవీ పర్యావరణ పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న కీటక శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. ముఖ్యంగా వీటి ద్వారా వ్యాధులు వస్తాయనే.. భయం పురాతన గ్రీస్ కాలం నుంచే ఉందని వారు స్పష్టం చేశారు. 


బొద్దింకలలో ఉండే ట్రోపోమియోసిన్ అనే ఒక ప్రోటీన్ మానవులకు అలర్జీని కలిగిస్తుంది అని సమాచారం. ఈ ప్రోటీన్ మనకు బొద్దింక మలం, చర్మం,  ఇతర భాగాలలో అధికంగా ఉంటుందట. ఇది పాకినా సరే అలర్జీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పురాతన ఈజిప్షన్లు అయితే బొద్దింకలను తరమడానికి ఏకంగా దేవుళ్లను పూజించే వారట.


మరి బొద్దింకలను ఇంట్లోకి రాకుండా ఎలా తరిమికొట్టాలి..?


ఆహారం, తేమతో కూడిన వాతావరణం ఉన్నచోట బొద్దింకలు వేగంగా వృద్ధి చెందుతాయని.. పరిశుభ్రత పాటిస్తే ఇవి రావు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తిన్న ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి.. మిగిలిపోయిన ఆహారాన్ని బయటపడేయాలి ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి.. సాధ్యమైనంత వరకు చెత్త డబ్బాలు మూసి వేసేలా ఉండాలి. రాత్రిపూట చెత్త డబ్బాలను బయట పెట్టాలి. ఇక బొద్దింకలు కిటికీలు, తలుపులు ద్వారా కూడా ప్రవేశిస్తాయి. కాబట్టి అవసరం లేనప్పుడు వాటిని మూసివేయాలి.


అలాగే డిష్ వాషర్ల నుంచి ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి.. రాత్రిపూట దానిపైన ఏదైనా కప్పి ఉంచినా సరే అవి బయటకు రావు. అలాగే మార్కెట్లో దొరికే కొన్ని ఉత్పత్తుల వల్ల కూడా బొద్దింకలను తరిమి వేయవచ్చు.. కానీ ఇవి మనుషులకు హానికరం కాబట్టి.. అవసరమైనప్పుడు బొద్ధింకలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వంటగది నుండి బొద్దింకలు పరార్ అవుతాయి.


Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!


Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి