How To Get Rid Of Dandruff: ఎండకాలంలో జుట్టును సంరక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా వెంట్రుకల్లో చుండ్రు రావడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ చుండ్రు సమస్యలు వింటర్‌, సమ్మర్‌ సీజన్‌లో అధికమవ్వడం విశేషం. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. ఈ ఉత్పత్తుల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన  షాంపూ కండీషనర్‌లను తప్పనిసరిగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.  జుట్టును చుండ్రు నుంచి ఎలా విముక్తి  కలిగించాలో తెలుసుకుందాం..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా జుట్టులో చుండ్రును సులభంగా వదిలించుకోండి:


చుండ్రు విముక్తి  కోసం టీ ట్రీ ఆయిల్:


జుట్టు నుంచి చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుందని వారు పేర్కొన్నారు. దీని కోసం టీ ట్రీ ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. ఇప్పుడు దీన్ని తలకు అప్లై చేయండి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.


చుండ్రు విముక్తి  కోసం కొబ్బరి నూనె:


కొబ్బరి నూనె చర్మానికే కాకుండా.. జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. తలపై చుండ్రు ఉంటే కొబ్బరి నూనెను తప్పకుండా వినియోగించండని నిపుణులు తెలుపుతున్నారు.


కలబంద:


అలోవెరాను చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ కలబంద జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది చుండ్రు సమస్యను దూరం చేయడమే కాకుండా వెంట్రుకలను బలపరుతుంది.


యాపిల్ వెనిగర్:


 చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి యాపిల్ వెనిగర్‌ని కూడా వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. చుండ్రును తొలగించడానికి ఆపిల్ వెనిగర్ ఒక గ్రేట్ హోం రెమెడీగా అని చెప్పుకోవచ్చు. దీనికోసం 2 టీస్పూన్ల షాంపూలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి..దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేయండి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Isabgol For Weight Loss: ఈసబ్ గోల్ ఊకతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!


Also Read: Grow Coriander Leaf At Home: కొత్తిమీరను పెంచడానికి వివిధ మార్గాలు..ఇంటి ఏరియాలో ఇలా సులభంగా పెంచండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook