Money Plant in Glass Bottle:  మనలో చాలామందికి మనీ ప్లాంట్‌ మొక్కను పెంచుకోవాలనుంటుంది. మరికొందరు ఇప్పటికే మనీప్లాంట్‌ మొక్కను ఇళ్లలో పెంచుకుంటున్నారు. మీరు కూడా మనీప్లాంట్‌ మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? దాని నిర్వహణ ఎలా? అని ఆలోచించి వెనుకడుగు వేస్తున్నారా? అలా అయితే ఈరోజు మేం సులభంగా గాజు సీసాలో మనీప్లాంట్‌ పెంచుకోవడం ఎలా చెబుతాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనీప్లాంట్ మొక్కతో ఇంటికి ఆర్థిక లాభం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. మన హిందూ సంప్రదాంయలో కూడా తులసి మొక్క, కలబంద మొక్కతోపాటు మనీప్లాంట్‌ మొక్కను కూడా అందరి ఇళ్లలో పెంచుకుంటారు. దీన్ని మట్టిలో పెంచుకోవచ్చు, నీటి సీసాలో కూడా పెంచుకోవచ్చు. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. ఇది ఇంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు ఆర్థిక శ్రేయస్సును కూడా ఇస్తుంది. అంతేకాదు మనీప్లాంట్‌ మొక్కకు ఎక్కువ సన్‌లైట్ కూడా అవసరం లేదు. ఇది పరోక్ష సూర్యకాంతిలో సుభంగా పెరుగుతుంది. మనీప్లాంట్‌ ఇండోర్, అవుట్‌ డోర్ మొక్క. దీనికి నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. 


మనీప్లాంట్‌ మొక్కను మీరు గాజుసీసాలో పెంచుకోవాలనుకుంటే సీసా పరిమాణం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. తద్వారా వాటి వేల్లు విస్తరించడానికి సహాయపడుతుంది. మొక్క కూడా త్వరగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మనీప్లాంట్‌ మొక్కను పెట్టే ముందు ఆ సీసాను శుభ్రంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొక్క వేళ్ల భాగం పూర్తిగా నీటిలో మునిగిపోయే వరకు నీరు పోయాలి. కేవలం ఆకుల భాగం మాత్రమే పైకి కనిపించేలా నాటుకోండి.


ఇదీ చదవండి: స్కిన్ టైటెనింగ్‌కు బెస్ట్‌ హోం రెమిడీస్.. ఇలా చేస్తే నిత్యయవ్వనం మీసొంతం..


అలా అని బాటిల్ పూర్తిగా నీటితో నింపకండి. కేవలం మొక్క మునిగే వరకు మాత్రమే నీటిని నింపండి. మనీప్లాంట్‌ మొక్కను ఏర్పాటు చేసుకోవడానికి కేవలం మినరల్ వాటర్‌ను మాత్రమే వాడాలి. ఎందుకంటే బోర్ వాటర్‌లో ఉండే లవణాలు మొక్కను చంపేస్తాయి. మనీప్లాంట్‌ మొక్క నాటిన నీటిని ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చండి. వెడల్పుగా ఉండే సీసాలో మనీప్లాంట్‌ మొక్కను నాటుకుంటే త్వరగా ఫంగస్ రాకుండా ఉంటుంది. ఈ సీసాను పరోక్ష సూర్యకాంతిలో పెట్టుకోవాలి. ఈ మొక్క ఆకులు పచ్చగా కనిపిస్తే వీటిని ఎప్పటికప్పుడు కట్‌ చేస్తూ ఉండాలి. 


ఇదీ చదవండి:ఇంట్లో చీమల బెడద ఎక్కువైందా? ఈ ఒక్క రెమిడీతో చిటికెలో పారిపోతాయి..


అయితే, వాస్తు పరంగా కూడా మనీప్లాంట్‌ మొక్క కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మొక్కను వాస్తుపరంగా ఈశాన్యదిశలోనే పెంచుకోవాలి. ఈ మొక్క పెంచుకునేటప్పుడు ఆకులు కింది భాగంలో వేళాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనీప్లాంట్‌ మొక్క పై భాగానికి ఎగబాకేలా ఉండాలి. నేలపై తాకకుండా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter