Skin Tightening Homeremedies: స్కిన్ టైటెనింగ్‌కు బెస్ట్‌ హోం రెమిడీస్.. ఇలా చేస్తే నిత్యయవ్వనం మీసొంతం..

Skin Tightening Homeremedies: ముఖం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం. అయితే, కొన్ని రకాల హోం రెమిడీలు కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. కొన్ని హోం రెమిడీలతో మన స్కిన్ పై కొన్ని జాగ్రత్తలు తీసుకుని స్కిన్ టైటెనింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 09:49 PM IST
Skin Tightening Homeremedies: స్కిన్ టైటెనింగ్‌కు బెస్ట్‌ హోం రెమిడీస్.. ఇలా చేస్తే నిత్యయవ్వనం మీసొంతం..

Skin Tightening Homeremedies: ముఖం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం. అయితే, కొన్ని రకాల హోం రెమిడీలు కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. కొన్ని హోం రెమిడీలతో మన స్కిన్ పై కొన్ని జాగ్రత్తలు తీసుకుని స్కిన్ టైటెనింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

హైడ్రేషన్..
ముఖ చర్మం సాగేలా మెత్తగా ఉండాలంటే హైడ్రేషన్ ఎంతో ముఖ్యం. దీనికి నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మనం హైడ్రేటెడ్ గా ఉంటాం. ఇది ముఖాన్ని కూడా హైడ్రేటెడ్ గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

డైట్..
ఆరోగ్యకరమై ఆహారాలు మాత్రమే మన ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు తీసుకుంటే మన చర్మ ఆరోగ్యం బాగుంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతుంది.

ఫేషియల్ ఎక్సర్‌సైజ్..
ఈ డైట్ పాటిస్తూనే కొన్ని ముఖానికి సంబంధించిన ఎక్సర్‌సైజులు చేస్తూ ఉండాలి. ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌ను పెంచుతుంది. ముఖంపై జారినట్లుగా కనిపించే స్కిన్‌ను టైట్ గా మారుస్తుంది. మన చేతులతో మృదువుగా మసాజ్ చేస్తూ ఉంటాలి. ముఖం అక్కడక్కడ ట్యాప్ చేస్తూ ఉండాలి ఇది రక్తసరఫరాను పెంచుతుంది.

ఎక్స్‌ఫోలియేషన్..
చర్మం ప్రతిరోజూ ఎక్స్‌ఫోలియేట్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిస్తుంది.  ముఖంపై మృదువుగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి చక్కెర, ఓట్మిల్, తేనెతో కలిపి ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోవాలి.

మసాజ్..
తరచూ ముఖంపై మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది.  కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనెతో కూడా ముఖంపై మసాజ్ చేసుకోవాలి.

ఎగ్ వైట్..
ఎగ్ వైట్లో కూడా స్కిన్ టైటెనింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ మాస్క్ తరచూ వేసుకుంటే ముఖంపై గ్లో కూడా పెరుగుతుంది. ముఖంపై ఎగ్ వైట్ మాస్క్ వేసుకుని ఓ 15 నిమిషాలు వేసుకుని అలాగే ఆరనివ్వండి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.

ఇదీ చదవండి: ఇంట్లో చీమల బెడద ఎక్కువైందా? ఈ ఒక్క రెమిడీతో చిటికెలో పారిపోతాయి..

కలబంద..
కలబందలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. కలబందను జెల్ మన ముఖానికి అప్లై చేసుకుంటే కూడా స్కిన్ టెక్చర్‌ను మెరుగుపరుస్తుంది.

కీరా..
కీరదోసకాయలో కూలింగ్ ప్రభావం ఉంటుంది. ఇది తాత్కాలికంగా స్కిన్ ను వెంటనే టైట్ చేసే గుణం ఉంటుంది. కీర దోసకాయ ముక్కలుగా కట్ చేసి ముఖంపై మసాజ్ చేసుకోవాలి. కీరదోసకాయ జ్యూస్ టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు.

  ఇదీ చదవండి: దుస్తులపై హోలీ రంగు మరకలు తొలగించడం ఎలా? ఈ ఈజీ ట్రిక్ మీకోసం..
యోగర్ట్..
యోగర్ట్‌ లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ ను సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ముఖంపై స్కిన్ను టైట్ చేయడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. యోగర్ట్ తో చేసిన మాస్క్‌ను ముఖంపై అప్లై చేసుకోవాలి. దీన్ని ఓ 15 నిమిషాలపాటు అలాగే ఆరనిచ్చి సాధారణ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ ఎలస్టిసిటీని మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్లో పెట్టి ముఖంపై పెట్టి కంప్రెస్ చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్‌తో మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇది స్కిన్ టెక్చర్ మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. స్మోకింగ్, ఎండ ప్రభావం ఎక్కువగా ముఖంపై పడకుండా జాగ్రత్తపడాలి. ధూమపానం వదిలేసి హానికర సూర్య కిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

(గమనిక: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News