Milk Shakes: వేసవిలో మీ ఇంట్లోనే మిల్క్‌షేక్ తయారు చేసుకోండి ఇలా..
Milk Shakes Recipes: వేసవికాలంలో మిల్క్ షేక్‌కు చాలా డిమాండ్ ఉంటుంది. చాలా మంది డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు మిల్క్ షేక్, డ్రీంక్స్ తీసుకుంటారు. అయితే బయట తయారు చేసిన మిల్క్ షేక్ కన్నామనం ఇంట్లోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చు. ఈ టిప్స్‌ను ఉపయోగించి మీరు కూడా ఈ మిల్క్ షేక్ చేసుకోండి .
Milk Shakes Recipes: మిల్క్ షేక్ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని పిల్లలు, పెద్దలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ వేసవికాలంలో వీటిని ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అయితే నీరు కన్నా పండ్లు జ్యూస్, మిల్క్ షేక్ కొంచెం హైడ్రేట్ చేయడానికి సహాయపడుతాయి. అయితే ఈ డ్రీంక్స్ కోసం ఎలాంటి ఖర్చు లేకుండా మనం కూడా ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. దీని అందరూ ఎంజాయ్ చేయవచ్చు.
ఇంట్లోనే మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా:
బనాన షేక్:
బనాన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు పెరగడంలో కూడా సహాయపడుతుంది. దీని వేసవికాలంలో తీసుకోవడం వల్ల శక్తి పొందవచ్చు. దీని కోసం మీరు అరటిపండు, పాలు, ఐస్ క్యూబ్స్, ఖర్జూరం తీసుకొని మిక్స్‌లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి.
రోజ్ సిరప్ షేక్:
దీని కోసం మీరు రోజ్ సిరప్, పాలు, ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. వీటిని ఉపయోగించి జ్యూస్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
మామిడి షేక్:
వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. దీంతో కూడా షేక్ తయారు చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు మామిడి పండు, పాలు, వెనీలా, ఐస్ క్రీం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి.
కొబ్బరి షేక్:
లేత కొబ్బరితో షేక్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం కొబ్బరి, పాలు, కొబ్బరి నీళ్ళు , తేనె ను ఉపయోగించాలి.వీటితో షేక్ తయారు చేసుకోవడం వల్ల వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పిస్తా షేక్:
దీని కోసం మీరు పిస్తాలను ఉపయోగించాలి. పాలు, పిస్తా, వెనిలా ఐస్‌క్రీమ్ తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వేడి తొలుగుతుంది.
ఈ షేక్‌తో పాటు మీరు డ్రై ఫూట్స్‌తో కూడా మిల్క్ షేక్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కూరగాయలతో కూడా మంచి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చు.
Also Read: Summer Foods: వేసవికాలంలో ఈ పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook