Oatmeal Face Mask for Skin Care: ఓట్స్‌ తయారు చేసిన ఆహార పదార్థాలు శరీరానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యలు తగ్గించి శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికే కాకుండా అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్మీల్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్.. చెమట, దుమ్ము కారణంగా వచ్చే తీవ్ర చర్మ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేటర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. వేసవి కారణంగా మీరు కూడా చర్మ సమస్యల బారిన పడితే తప్పకుండా ఈ ఫేస్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఓట్ మీల్ ఫేస్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓట్ మీల్ ఫేస్ ఫ్యాక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
2 టీ స్పూన్‌ ఓట్స్‌
1 టీ స్పూన్‌ పెరుగు
1/2 టీ స్పూన్‌ తేనె


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


ఓట్ మీల్ ఫేస్ మాస్క్ తయారి విధానం:
1. ఓట్ మీల్ ఫేస్ మాస్క్ తయారు చేయాలనుకునేవారు ముందుగా ఓ చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. 
2. ఆ తర్వాత గిన్నెలో ఓట్స్‌ను పౌండర్‌ వేయాలి.
3. ఇలా చేసిన తర్వాత అదే పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి.  
4. ఆ తర్వాత ఇదే మిశ్రమంలో రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్‌ చేయాలి.
5. ఈ మిశ్రమాలను 5 నిమిషాలతో పాటు కలుపుకోవాలి.
6. ఆ తర్వాత ఓ చిన్న డబ్బలతో భద్రపరుచుకోవాలి.


ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను ఎలా వినియోగించాలో తెలుసా?:
1. ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగించే ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 
2. ఆ తర్వాత ఫేస్‌ ఫ్యాక్‌ను ముఖానికి అప్లై చేయాలి.
3. ఇలా అప్లై చేసిన తర్వాత 7 నిమిషాల పాటు మీ చేసి వేళ్లతో నెమ్మదిగా మూఖాన్ని మసాజ్‌ చేసుకోవాలి. 
4. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే..సులభంగా అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి