Importance Of Gooseberry: ఉసిరికాయలో ఔషధ గుణాలు..`అమృతం పండు` సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!!
Importance Of Gooseberry: ఉసిరి పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. రుచి చేదు ఉన్నవ్పటికీ ఇందులో చాలా రకాల పోషక విలువలున్నాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.
Importance Of Gooseberry: ఉసిరి పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. రుచి చేదు ఉన్నవ్పటికీ ఇందులో చాలా రకాల పోషక విలువలున్నాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. ఇది హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. ఇన్సులిన్‌ను తయారు చేసే ప్రక్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది కామెర్లు రాకుండా దోహదపడుతుంది. ఉసిరిలో ఉండే గుణాలు రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.
ప్రపంచంలో 'అమృతం'గా పిలవబడే కాయల్లో ఉసిరి ఒకటి. మొదట ఈ కాయను భారత దేశంలో కనుగొన్నారు. దీనిని దేవతలకు స్వరూపంగా కూడా భావిస్తారు. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని పురాణాలలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చెట్టును దేవుడిలాగా పూజిస్తారు. ఉసిరిని ఇతర దేశాల్లో 'నేక్టార్-ఫ్రూట్'గా పిలుస్తారు. ఆంగ్లంలో ఇండియన్ గూస్‌బెర్రీ అంటారు.
ఆమ్లా అనే ఆంగ్ల పేరు ఇది భారత ఉపఖండంలో ఉద్భవించిందని సూచిస్తుంది. ఈ పండు గురించి క్లుప్తంగా భారతదేశంలోని పురాతన ఆయుర్వేద గ్రంథాలు, జైమిని ఉపనిషత్తు, స్కంద పురాణం, పద్మ పురాణాలలో కూడా వివరించారు. భారత్‌లో చాలా మంది బ్రహ్మదేవుని కన్నీళ్ల నుంచి ఉసిరి పుట్టిందని నమ్ముతారు. పద్మ పురాణంలోని సృష్టి విభాగంలో ఈ పవిత్ర ఫలాన్ని వివరిస్తూ..విష్ణువు దీనితో ప్రసన్నుడయ్యాడని పేర్కొంది. భారతదేశంలో ఈ చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అందుకే దీనిని సంవత్సరానికి రెండుసార్లు పూజిస్తారు.
భారతీయ మత గ్రంథాలలో, ఆయుర్వేద గ్రంథాలలో, ఉసిరి మానవ శరీరానికి చాలా లాభాలను చేకూర్చుతాయని తెలిపాయి. ఇందులో లవణం (ఉప్పు రుచి) తప్ప మిగిలిన ఐదు రసాలు చేదు, ఆమ్లం, ఘాటు, రసాలు, తీపిగా ఉంటాయని 'చరకసంహిత' గ్రంథంలో వర్ణించారు.
భారతదేశంలోని ఇతర భాషలలో ఆమ్లా అని, అస్సామీలో ఆమ్లుకి, ఒరియాలో అయోన్లా, కన్నడలో నెల్లికాయ, తమిళంలో నెల్లిమర్, తెలుగులో ఉసిరికయా, మలయాళంలో నెల్లిమారం, బెంగాలీలో అమలకి, మరాఠీలో ఆవలకతి, గుజరాతీలో ఆమ్లా, ఆంగ్లంలో ఇండియన్ గూస్బెర్రీ అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు.
Also Read: Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook