Gas Problem Tips:  గ్యాస్, కడుపులో మంట చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇది రోజువారీ జీవనంలో కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్యలకు అనేక కారణాలు ఉండొచ్చు, వాటిని నిర్వహించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గ్యాస్‌ , కడుపులో మంటను సహాజంగా తగ్గించుకోవచ్చు. దాని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అది ఏంటో తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాస్, కడుపులో మంట ఎందుకు వస్తాయి?


నేటికాలంలో చాలా మంది చికెన్, రెడ్ మీట్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి కొవ్వు ఆహారాలు ఎక్కువగా తింటున్నారు. ఈ పదార్థాలు జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి కడుపులో మంటకు దారితీస్తాయి.  మిరియాలు, ఇంగువ వంటి మసాలాలు కడుపును చికాకుపెట్టి కడుపులో మంటను కలిగిస్తాయి. సోడా, టోనిక్ వంటి పానీయాలు కడుపులో గ్యాస్ ఏర్పడటానికి ప్రధాన కారణం. కాఫీ, టీ వంటివి కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఈ ఆహారపదార్థాలకు దూరంగా చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


గ్యాస్, కడుపులో మంట తగ్గించడం ఎలా    ? 


మనలో చాలామంది విపరీతంగా గంట గంటకి కాఫీ, టీలు, ఆహారపదార్థాలు తీసుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గ్యాప్‌ లేకుండ తినడం వల్ల యాసిడిటీ కలిగే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం , రాత్రి శరీరానికి సరిపడ ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిని నియంత్రించడానికి పండ్లు, నట్స్‌లను తినడం మంచిది. ఇవి కడుపు నింపడంతో పాటు ఆరోగ్యానికి మంచివి కూడా. గ్యాస్‌, కడుపులో మంట కలిగినప్పుడు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


తీసుకోవలసిన ఆహారాలు:


పండ్లు: బాదం, అరటి, అవకాడో, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్లు జీర్ణక్రియకు మంచివి.


కూరగాయలు: బంగాళాదుంప, క్యారెట్, బీట్‌రూట్, బొప్పాయి వంటి కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.


ధాన్యాలు: బ్రౌన్ రైస్, ఒట్స్, రాగి వంటి ధాన్యాలు ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. 


నీరు: నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విషవ్యర్తాలను తొలగిస్తుంది


గమనిక: ప్రతి వ్యక్తికి ఆహారం ప్రభావం వేరుగా ఉంటుంది. ఏ ఆహారం మీకు సరిపోతుందో తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ను సంప్రదించండి.


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.