Lemon Water Benefits: వేసవిలో లెమన్ వాటర్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?, ఈ తీవ్ర సమస్యలకు కూడా చెక్!
Lemon Water Benefits: ఎండాకాలంలో లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎండల కారణంగా వచ్చే తీవ్రనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా వేసవికాలం అనారోగ్య సమస్యలు బారిన పడితే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి.
Lemon Water Benefits: వేసవిలో జ్యూస్ లే కాకుండా.. నిమ్మరసాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది వీటికి బదులుగా మార్కెట్లో లభించే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల టీవీ రానారోగ్య సమస్యలతో పాటు.. మధుమేహం, పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా నాచురల్ గా లభించే నిమ్మరసం తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో తేమ సరైన పరిమాణంలో ఉంటుంది:
లెమన్ వాటర్ లో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు తాగడం వల్ల ఎండల కారణంగా ఏర్పడే శరీరంలో వేడి సులభంగా దూరమవుతుంది. అంతేకాకుండా శరీరాన్ని డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంచుతుంది. వేసవిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా లెమన్ వాటర్ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరం పనిచేయడానికి రోగ నిరోధక శక్తి తప్పకుండా అవసరమవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. తప్పకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో లభించే ఆహారాలను తీసుకోవలసిన ఉంటుంది. ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాల ప్రకారం వేసవిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజు రెండుసార్లు లెమన్ వాటర్ ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ:
ప్రస్తుతం అనారోగ్యకారమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలామంది పొట్ట సమస్యలతో పాటు జీర్ణక్రియ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఖాళీ గడుపుతూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
చర్మం నిగారింపు కోసం:
వేసవికాలం వచ్చిందంటే చాలు జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ప్రతిరోజు ఆహారాన్ని తీసుకోకముందు లెమన్ వాటర్ ని తాగాలి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడమే కాకుండా.. హైడ్రేషన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook