Insomnia : మనిషికి కడుపునిండా ఆహారంతో పాటు కంటి నిండా నిద్ర కూడా ఎంతో అవసరం. మనం సరిపడా నిద్రపోతేనే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపోతున్నాం అంటే మన శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి వివిధ ప్రక్రియల్లో పాల్గొని అలసిపోయిన మన శరీరానికి ఆ విశ్రాంతి తప్పనిసరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిద్రలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి NREM(non rapid eye movement), రెండవది REM ( rapid eye movement)ఉన్నాయి. NERM లోనే కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. REM అనేది మెమరీ కన్సాలిడేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఈ స్టేజ్ లోనే కలలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది.


సరేనా నిద్ర లేకపోతే మన శరీరం కూడా సరిగ్గా పని చేయదు. దేని పైనా మనం దృష్టి పెట్టలేం. శరీరంతో పాటు మనసు కూడా అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అడ మగ తేడా లేకుండా ప్రతి మనిషి రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవడం చాలా అవసరం. కానీ కొందరు ఐదు గంటలు మాత్రమే నిద్రపోతారు. అలాంటి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


శరీరంతో పాటు మెదడు సరిగ్గా పని చేయడంలో కూడా నిద్ర పాత్ర ఎక్కువగానే ఉంటుంది. మెదడు కూడా అలసిపోతుంది. సమర్థవంతంగా పనిచేయలేదు. ఏ పని మీద ఏకాగ్రత కుదరదు. మానసిక స్థితిని నియంత్రించే రసాయనాలు సరైన నిద్రనుంచే లభిస్తాయి.


నిద్రలేమి కారణంగా రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. చక్కగా నిద్రపోవడం వల్ల శరీరంలో జర్మ్ ఫైటింగ్ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా త్వరగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.


మంచి నిద్ర బరువు పై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు చక్కెర, కొవ్వు ఉన్న ఆహారాలు తినాలని కోరికలు పెరుగుతాయి. ఆకలి కూడా పెరుగుతుంది. అధికంగా తినడం వల్ల బరువు పెరగడం కూడా జరుగుతుంది.


ముఖ్యంగా నిద్రలేమి ఉన్నవారు డ్రైవింగ్ కి దూరంగా ఉండటం కూడా మంచిది. నిద్ర సరిగ్గా లేకపోతే జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా ఉండదు. మన మెదడు సరిగ్గా పని చేయదు. మన జ్ఞాపక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడానికి కష్టమవుతుంది.


ఇక నిద్రలేమి వల్ల గుండెపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అది రక్తపోటుకి దారి తీసే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఎక్కువసేపు నిద్రపోకపోతే అది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీయవచ్చు. కాలక్రమేణా ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.


Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..


Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter