Long Hair Tips: జుట్టు పొడవుగా పెరగాలని కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
Long Hair Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా పెంచుకోవాలిని అనుకుంటారు. ప్రస్తుతం చాలా మంది జుట్టును పొడవుగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వాడుతున్నారు.
Long Hair Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా పెంచుకోవాలిని అనుకుంటారు. ప్రస్తుతం చాలా మంది జుట్టును పొడవుగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వాడుతున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అయితే దీని కోసం పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు పొడవుగా ఉండటమే కాకుండా నిగనిగలాడుతుంది
మసాలా ఆహారం నుంచి దూరం ఉండండి:
స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు.. ఇది పెరిగే జుట్టును కూడా నియంత్రిస్తుంది. మెరుగైన జుట్టుకోసం జంక్ ఫుడ్, నూనెతో కూడిన మసాలా పదార్థాలను తినక పోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
నీటిని ఎక్కువగా తాగండి:
కొన్నిసార్లు శరీరంలో నీటి కొరత ఉండడం వల్ల కూడా జుట్టు పెరగదని నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు పెరగాలంటే... మెరుగైన జుట్టు కోసం శరీరంలో నీటి కొరత ఉండకుండా చూసుకోండి.
నూనెతో మసాజ్ చేయండి:
జుట్టుకు పోషణ చాలా అవసరం. కావున వారానికి మూడుసార్లు.. జుట్టుకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుపడి, జుట్టు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జుట్టు పొడవుగా పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook