Skin Hydration During Monsoon Season: వాతావరణంలో మార్పులను బట్టి కూడా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరిలో వేసవిలో టానింగ్, చలికాలంలో పొడిబారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా చర్మం అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చర్మం పొరలు పొరలుగా తయారు అవ్వడం, మొటిమలు రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పకుండా వానా కాలంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి:
వాతావరణంలో తేమ పెరిగితే తప్పకుండా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అది పొడిగా, నిర్జీవంగా మారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వృద్ధాప్య ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి వానా కాలంలో చర్మం హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఇంట్లో లభించే పలు సహాజనమైన పదార్థాలతో తయారు చేసిన స్కిన్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. 


చర్మం హైడ్రేట్ ఉండడానికి వీటిని వినియోగించండి చాలు:
ఈ మాయిశ్చరైజర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది:

వానా కాలంలో చాలా మందిలో చర్మం జిడ్డుగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నీరు అధిక పరిమాణంలో ఉండే మాయిశ్చరైజన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు విటమిన్‌ ఇ క్యాప్సూల్‌ను నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతంలో వినియోగించాల్సి ఉంటుంది. 


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు


దోసకాయ ఐస్ క్యూబ్స్:
తరచుగా మీ ముఖం పొడిగా మారుతుంటే దోసకాయ ఐస్‌ క్యూబ్స్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యూబ్స్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయ రసం తీసి ఫ్రీజర్‌లో ఫ్రీజ్ చేయాలి. క్యూబ్స్‌లా తయారైన తర్వాత ముఖానికి వినియోగించాల్సి ఉంటుంది.


రోజ్ వాటర్:
చర్మం పొడిబారడం, జిడ్డు, దురద వంటి సమస్యలు వస్తుంటే రోజ్‌వాటర్‌ను స్ప్రే బాటిల్‌ పోసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత మంచి నీటితో ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook