COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Muscle Cramps: ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ కండరాల నొప్పులు కండరాలలో తిమ్మిర్లు, ఉన్నట్టుండి కండరాలు పట్టడం వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం శరీరంలోని లవణాలు, క్యాల్షియం తగ్గడం, వ్యాయామాలు లేకపోవడం వల్లే వస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కండరాలు పట్టడం, తిమ్మిర్లు రావడం సమస్యలు ఎక్కువగా చలికాలంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి.


వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవారిలో 400 మిల్లీగ్రాముల క్యాల్షియం, చిన్నపిల్లల్లో 600 మిల్లీ గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తప్పకుండా ఉండాలి. అయితే చాలామందిలో శరీరంలోని క్యాల్షియంలోని ఈ అంకెల్లో మార్పులు వస్తున్నాయి. కొంతమందిలో క్యాల్షియ లోపం కూడా వస్తోంది. దీని కారణంగానే చాలామందిలో కండరాల్లో తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్యాల్షియం ఎక్కువ పరిమాణంలో లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 


అంతేకాకుండా ఆకుకూరలు మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిర్లతోపాటు అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరంలోని లవణాల పరిమాణంతో పాటు మెగ్నీషియం కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు నువ్వులతో తయారు చేసిన ఉండలను మధ్యాహ్నం పూట స్నాక్స్ లా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.



తరచుగా కండరాలలో తిమ్మిర్లు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు కొబ్బరి నీటిని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని వారంటున్నారు. కొబ్బరి నీటిలో లభించే సోడియం శరీరంలోని అన్ని భాగాల్లోని తిమ్మిర్లను తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు శరీరమంతా తిమ్మిర్లతో బాధపడేవారు తప్పకుండా కొబ్బరినీటిని ట్రై చేయండి. దీంతోపాటు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ తిమ్మిర్ల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే 15 నిమిషాల పాటు వ్యాయామాలతో పాటు యోగా చేయడం వల్ల మిమ్మిర్ల నుంచి ఉపశమనం పొందుతారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter