Nita Ambani Blouse: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు నెలకొన్న అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ప్రజలంతా ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలపైనే చెరువులు కొరుక్కుంటున్నారు. తాజాగా వరుడు అనంత్‌ తల్లి నీతా అంబానీపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అందరి కళ్లు ఆమె ధరించిన జాకెట్‌పై కన్నుపడింది. ఆమె జాకెట్‌ వెనుకాల భాగంపై ఉన్న బొమ్మలు ఎంతో ప్రత్యేకత కలిగింది ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anant Radhika Marriage: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. అంబానీ కొడుకు లగ్గానికి ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?


 


ముంబైలోని బాంద్రాలో కలిగిన జియో వరల్డ్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి రోజు ముకేశ్‌ అంబానీ సతీమణి, పెళ్లి కొడుకు తల్లి నీతా అంబానీ ఎంతో ప్రత్యేకంగా కనిపించారు. దాండియా ఆడుతూ.. డ్యాన్స్‌లు చేస్తూ.. వీఐపీలకు ఆహ్వానం పలుకుతూ.. వారికి మర్యాదలు చేస్తూ సందడి చేశారు. అయితే తన కుమారుడి పెళ్లి సందర్భంగా ప్రత్యేకంగా తయారయ్యారు. లేతా గులాబీ రంగులో ప్రత్యేకమైన వర్క్‌తో కూడిన ఉత్తరాది సంప్రదాయం ప్రకారం ఆమె చీర ధరించారు. ఆమె ధరించిన వస్త్రం పేరు జర్దోజీ ఘాగ్రా అని అంటారు. మెడలో పచ్చల హారం.. చెవి దుద్దులు.. పాపిట బిల్ల, కంకణం, చేతికి గాజులు, ఉంగరం వంటి అన్నీ ఆభరణాలు పచ్చటి రంగులో ఉన్నాయి.

Also Read: Mukesh Ambani: కుమారుడి పెళ్లి భాజాలు.. 50 మంది జంటలకు ముకేశ్‌ అంబానీ కళ్లు చెదిరే కానుకలు


 


నీతా అంబానీ డ్రెస్‌ను అబు జానీ సందీప్‌ ఖోస్లా ఆ డ్రెస్‌కు ఎంబ్రాయిడరీ చేశారు. ఇక ఆమె జాకెట్‌ వెనుకాల భాగం మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆ జాకెట్‌ వెనుకాల భాగంలో కుటుంబసభ్యుల పేర్లు ప్రత్యేకంగా రాయించారు. తన పిల్లలు, మనవళ్ల పేర్లు నీతా అంబానీ ఉండేలా డిజైన్‌ చేయించుకున్నారు. ఇషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, శ్లోకా మెహతా, మనవళ్లు ఆదియా, కృష్ణ, వేద, పృథ్వీ పేర్లను నీతా అంబానీ తన జాకెట్‌ వెనుకాల భాగంలో హిందీలో రాయించుకుని ప్రత్యేకత చాటారు.

అంతేకాకుండా జాకెట్‌ వెనుకాల భాగంలో ఏనుగులు వచ్చాయి. కుటుంబసభ్యుల పేర్లు రాయించుకోవడం చూస్తుంటే నీతాకు తన కుటుంబమంటే ఎంత ప్రేమను తెలుస్తోంది. ఆమె ధరించిన జర్దోజీ ఘాగ్రా, జాకెట్‌పైన, అభరణాలపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మహిళలు ఆ డ్రెస్‌ ప్రత్యేకతలు తెలుసుకుని నోరెళ్ల బెట్టుకుంటున్నారు. అయితే ఆ డ్రెస్‌కు అయిన ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుందని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి