Mukesh Ambani Mass Wedding: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించగా.. తాజాగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుమారుడి వివాహం సందర్భంగా 50 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. కొత్త వధూవరులను ఆశీర్వదించిన అంబానీ దంపతులు కొత్త జంటలకు కళ్లు చెదిరేలా కానుకలు ఇచ్చారు. నగదు సహాయంతోపాటు నూతన వధూవరుల కాపురానికి సరిపడా వస్తు సామగ్రి అందించారు. ఏమేమి ఇచ్చారో తెలుసుకోండి.
Also Read: Jio Hikes Tariff: కస్టమర్లకు జియో భారీ షాక్.. ఊహించని రీతిలో అన్నీ రేట్లు భారీగా పెరుగుదల
తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12వ తేదీన రాధికా మర్చంట్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం సామూహిక వివాహాలు జరిపించారు. ఎంపిక చేసిన 50 జంటలకు ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు కోడలు ఆకాశ్ అంబానీ-శ్లోక, కుమార్తె అల్లుడు ఈశా-ఆనంద్ హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణాల నడుమ సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. వధూవరుల బంధువులకు భోజనాలు అందించారు.
కానుకలు ఇవే..
కొత్త జంటకు బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండె మెట్టెలు, కాళ్ల పట్టీలు ఇచ్చారు.
పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనం పేరిట రూ.1.01 లక్షల చెక్కు అందించారు.
కాపురానికి కావాల్సిన వస్తువులు: 36 రకాల నిత్యావసర వస్తువులు అందించారు. వాటిలో గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు తదితర ఉన్నాయి. ఏడాదికి సరిపడా సరుకులు అందించారు.
అనంత్, రాధిక వివాహ షెడ్యూల్ ఇదే
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకల జరగనున్నాయి. జూలై 12న శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈనెల 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, కీలకమైన ఘట్ట 14వ తేదీన మంగళ్ ఉత్సవ్ జరుగుతుంది. అంటే వివాహ వేడుక.
అంతకుముందు ప్రీ వెడ్డింగ్ పేరిట గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి