Anant Radhika Marriage: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. అంబానీ కొడుకు లగ్గానికి ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?

You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 11, 2024, 11:08 PM IST
Anant Radhika Marriage: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. అంబానీ కొడుకు లగ్గానికి ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?

Anant Radhika Marriage: భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అత్యంత చర్చనీయాంశంగా ముకేశ్‌ అంబానీ కుమారుడి వివాహం మారింది. ఆకాశమంతా పందిరి వేసి భూలోకమంతా పీట వేసినట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో ముకేశ్‌ అంబానీ తన కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి జరిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఈ పెళ్లి రికార్డులకు ఎక్కనుంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్‌ పార్టీలు, సంగీత్‌తోపాటు ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు పెళ్లికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Also Read: Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్‌.. ఈ కొత్త నిబంధన తెలుసుకోకుంటే చాలా ఇబ్బందే

ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో శుక్రవారం జరగనుంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలోని ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార, పారిశ్రామిక ప్రము ఖులు తరలిరానున్నారు. అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా హాజరవుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, మీడియా, ఆధ్యాత్మిక ఇలా ప్రతి రంగం నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

Also Read: Mukesh Ambani: కుమారుడి పెళ్లి భాజాలు.. 50 మంది జంటలకు ముకేశ్‌ అంబానీ కళ్లు చెదిరే కానుకలు

అతిథులు వీరే
సౌదీ అరామ్‌కో సీఈఓ అమిన్ నాసర్, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ముబాద లా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈఓ ముర్రేతోపాటు దిగ్గజ కంపెనీల సీఈఓలు, వ్యాపార ప్రముఖులు హాజరవనున్నారు.

అద్దెకు విమానాలు
ఈ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం కనీవినీ రీతిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతిథుల కోసం ముకేశ్ అంబానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్‌లు, 100కు పైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. జూలై 14వ తేదీ రిసెప్షన్‌తో ఈ పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. అప్పటివరకు వీవీఐపీలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థం మొదలుకుని రిసెప్షన్‌ వరకు మొత్తంగా ఈ పెళ్లికి అవుతున్న ఖర్చు దాదాపు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News