Sleeping while Traveling: ప్రయాణాల్లో తెలియకుండానే ఎందుకు నిద్రపోతుంటామో తెలుసా..??
కారు ప్రయాణాలు లేదా బస్సు, రైలు వంటి ప్రయాణాల్లో మనం ఇట్టే నిద్రపోతాం ఎందుకు అంటారు..?? చాలా మందికి కారణం తెలియదు కదా..? ఈ సందేహానికి కారణం ఏంటో తెలుసుకుందాం!
Sleeping while Traveling: రైలు, బస్సు లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే పడుకుంటూ ఉంటాము. రాత్రిళ్లు ఇంట్లో పరుపు, దిండు అన్ని అందుబాటులో ఉన్నాకూడా రాని నిద్ర ప్రయాణాలు చేసేప్పుడు వస్తుంది కదా..!! ప్రయాణ సమయాల్లో రైలులో లేదా బస్సులో ఎంత శబ్దం జరుగుతున్నా, మన నిద్రలో ఎలాంటి ఆటంకం ఉండదు.
ఇలా ఎందుకు తెలియకుండానే ప్రయాణాల్లో నిద్రపవుతాము..?? దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం..!!
Also Read: Most Eligible Bachelor Trailer: మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9వేల నైట్స్ కలిసి పడుకోవాలి
ప్రయాణాల్లో ఎందుకు నిద్ర వస్తుంది..??
నిజానికి ప్రయాణాల్లో నిద్రపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి, ప్రయాణాలు చేసేప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందని నీదీ వల్ల నిద్రొస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. చల్లటి గాలి శరీరానికి తగలటం వలన నిద్ర పోతుంటామని కొంత మంది చెబుతుంటారు. కానీ శాస్త్రీయ ఆధారణలను బట్టి చూస్తే దీనికి కారణం ఏంటంటే "రాకింగ్ సెన్సేషన్".
ఉదాహరణకు... చిన్న పిల్లలు ఊయలలో వేసి అటు ఇటు ఊపగానే పడుకుంటారు కదా.. అలానే ప్రయాణాల్లో కూడా మన శరీరం కొద్దిగా అటు ఇటు కదలటం మూలంగా మనం నిద్రపోతుంటామమని నిపుణులు చెప్బుతున్నారు.
Also Read: Vastu Tips for house: ఇంట్లో నల్లాలు లీక్ అయితే Money problems తప్పవా ?
ఒక ఫ్లోలో కదలికల వల్ల నిద్ర వస్తుంది
మన శరీరం ఒక రకంగా తేలికగా కదలటాన్ని "రాకింగ్ సెన్సేషన్" (Rocking Sensation) అంటారు. ఇది మన మెదడుపై సమకాలీకరణ ప్రభావాన్ని (Synchronizing Effect) చూపుతుంది ఫలితంగా మనం స్లీపింగ్ మోడ్‌లోకి (Sleep Mode) వెళతాము. దీనినే "స్లో రాకింగ్" (Slow Rocking) అని కూడా అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కారణం చేత ప్రయాణాల్లో నిద్రపోవాలనే కోరిక మనస్సులో తలెత్తడం వలన నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాము.
సాధారణంగా గమనించినట్లయితే కొంత మంది పడుకోటానికి వివిధ రకాల బెడ్లను వాడుతుంటారు ఉదాహరణకు... వైబ్రేషన్ వచ్చే బెడ్లు, స్ప్రింగ్ అమర్చిన బెడ్లు.. వీటి వలన శరీరం రాకింగ్ సెన్సేషన్ లోకి వెళ్లటం కారణంగా తీవ్రగా నిద్రలోకి జారుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G\
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook