Most Eligible Bachelor Trailer: మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9వేల నైట్స్ కలిసి పడుకోవాలి

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'  ట్రైలర్ విడుదలైంది.. ఎలా ఉందో చూసి మీరే చెప్పండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 07:38 PM IST
  • విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' ట్రైలర్
  • ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్ సన్నివేశాలు
  • ఈ సారైనా అఖిల్ హిట్టు కొడతాడా లేదో చూడాలి
Most Eligible Bachelor Trailer: మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9వేల నైట్స్ కలిసి పడుకోవాలి

Most Eligible Bachelor Trailer: ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'Most Eligible Bachelor ఈ రోజు ట్రైలర్ విడుదల అవ్వగా.. అక్టోబర్ 15 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందించిన ఈ సినిమాకు  బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర‌వింద్ (Allu Arvind) స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందించగా.. ట్రైలర్ లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది 

Also Read: Actress Soujanya Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం... నటి సౌజన్య ఆత్మహత్య

ట్రైలర్ లవ్, కామెడీ మరియు తదితర అంశాలతో ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. మొదటగా పూజ హెగ్డే వాయిస్ తో ప్రారంభమైన ట్రైలర్... 'మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని ప్రారంభం అవుతుంది.. తరువాత ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్‌, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి' అని హీరో అఖిల్ చెప్పటం... ఇలా రెండు భిన్న అభిప్రాయాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు మధ్య కథ నడుస్తుందని తెలుస్తుంది  

'నీకు పెళ్లి గురించి ఏం తెలియదు. అసలు నీకు గురించి నీకే తెలియదు' అని హీరోయిన్ అనటం .. 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను' అని హీరో అనటం ఆకట్టుకుంటున్నాయి. మందని వదలి.. కొత్తదారి వెతికి. నేను వెళ్తున్నా, మీరూ రండి’ అనే డైలాగ్ తో ట్రైలర్ ముగించటం ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతున్నాయి. 

Also Read: Scary Video: చేతి కర్రతో చిరుతతో పోరాటం.. ప్రాణాలు కాపాడుకున్న వృద్దురాలు

'బొమ్మరిల్లు' (Bommarillu Movie) సినిమా లానే ఈ సినిమా కూడా కొంచెం డిఫరెంట్ కథతో రానుంది అని తెలుస్తుంది. మ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించగా సినిమా విడుదల అయ్యాకే పూర్తీ క్లారిటీ వచ్చేలా ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News