Sleep Aid Handheld Device: కంటినిండా నిద్రను తెచ్చి.. ముఖాన్ని అందంగా మార్చే పరికరం

Sleep Aid Handheld Device: ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్త పరికరం ఒకటి వచ్చింది. దాని పేరు హ్యాండ్‌ హెల్డ్‌ స్లీప్‌ ఎయిడ్‌  ఇస్ట్రుమెంట్‌ అదేనండి నిద్రపుచ్చే పరికరం. కంటినిండా నిద్రను తెచ్చి, ముఖ వర్చస్సును పెంచుతుంది ఈ పరికరం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 12:13 PM IST
  • మార్కెట్లోకి నిద్రపుచ్చే పరికం
  • ఒత్తిడిని దూరం చేసే బుల్లి యంత్రం
  • ముఖ అందాన్ని పెంచుతుందంట
Sleep Aid Handheld Device: కంటినిండా నిద్రను తెచ్చి.. ముఖాన్ని అందంగా మార్చే పరికరం

Sleep Aid Device: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ 24 గంటలూ ఆన్‌లైన్‌లోనే గడుపుతూ ఉండే పరిస్థితి వచ్చింది. ఏదో ఒక విషయంలో చాలా మంది ఆన్‌లైన్‌లో (Online) ఉండాల్సి వస్తోంది. అయితే ఇలా ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లోనే ఉండడంతో నిద్రపట్టక చాలా మంది ఇబ్బందులుపడుతుంటారు. అంతేకాదు నిద్రలేమితో (Insomnia) ముఖం అంతా పాలిపోయినట్లుగా మారుతూ ఉంటుంది. కొందరికి కళ్ల కింద నల్లగా మారి కాస్త అందవికారంగా కనపడుతూ ఉంటుంది. వీటన్నింటికీ కారణం సరైన నిద్ర లేకపోవడం. 

నిద్రపుచ్చే పరికరం

మరి ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్త పరికరం ఒకటి వచ్చింది. దాని పేరు హ్యాండ్‌ హెల్డ్‌ స్లీప్‌ ఎయిడ్‌  (Handheld sleep aid ) ఇస్ట్రుమెంట్‌ అదేనండి నిద్రపుచ్చే పరికరం. కంటినిండా నిద్రను తెచ్చి, ముఖ వర్చస్సును పెంచుతుంది ఈ పరికరం. ఇది ఎంతో హైటెక్నాలజీతో రూపొందింది. తగినంత నిద్ర లేని వారికి బాధపడేవారికి ఇది కాస్త సహాయపడుతుంది అట. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ పరికరాన్ని చేతితో పట్టుకుని, ప్రశాంతంగా  కళ్లు మూసుకుంటే చాలు మెదడులోని కండరాలను ఉత్తేజమై వెంటనే నిద్ర ముంచుకొస్తుందట. అంతేకాదు ఇది సురక్షితమైనది చాలా  తేలికైనది.ఇందులో వర్కింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. ఎక్కువ తీవ్రత కావాలంటే హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్‌ మోడ్‌ నొక్కాలి. అలాగే తీవ్రతను తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పరికరంలో. 

Also Read : Horoscope Today:ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో కలిసొస్తుంది.. వారికేమో ఆకస్మికంగా డబ్బు రానుంది

ఒత్తిడి దూరం

ఈ స్లీప్‌ (Sleep) ఎయిడ్‌ పరికరాన్ని ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. తలనొప్పి, ఒత్తిడి, (Stress) ఆందోళన వంటి సమస్యలను నుంచి ఇది దూరం చేస్తుంది అంటున్నారు నిర్వాహకులు. దీని ధర సుమారు సుమారు రూ. 2,200.  ఫీచర్స్‌ను బట్టీ ధరల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు. ఇది రకరకాల రూపాల్లో లభిస్తోంది.  చేతికి బ్రేస్‌లెట్‌లా  వేసుకునేందుకు వీలుగా కూడా ఈ పరికాన్ని రూపొందించారు.  పలు ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ఇది లభిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News